కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

ABN, First Publish Date - 2023-10-13T22:18:47+05:30

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’. ఇప్పుడు మూడో సీజన్‌ మొదలవ్వబోతోంది. తాజాగా మూడో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని ఆహా యాజమాన్యం విడుదల చేసింది. ఈ ప్రోమోలో పొలిటికల్ సెటైర్స్‌తో పాటు సినిమా టీమ్‌ని కూడా బాలయ్య ఓ ఆట ఆడించేశారు.

Balakrishna in Unstoppable With NBK Season 3 First Episode

నందమూరి నటసింహం బాలకృష్ణ (Natasimham Balakrishna) హోస్ట్‌గా ఆహా ఓటీటీలో రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’. ఇప్పుడు మూడో సీజన్‌కు సంబంధించి ఇటీవలే ఓ అప్‌డేట్ వచ్చింది. మూడో సీజన్‌కు సంబంధించి బాలయ్య సైన్ చేశారని, దసరాకి తన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) టీమ్‌తో ఓ ఎపిసోడ్‌ కూడా ఉండబోతుందనేలా వార్తలు వచ్చాయి. నిజంగానే దసరాకి ఈ షోతో దరువేయబోతున్నాడీ నందమూరి నటసింహం. తాజాగా ఈ సీజన్ 3కి (Unstoppable With NBK Season 3) సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోని ఆహా విడుదల చేసింది. ఇందులో బాలయ్య అన్ని కోణాలను టచ్ చేస్తూ.. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా విజృంభించేశారు.

‘భగవంత్ కేసరి’ యూనిట్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi), విలన్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal).. హీరోయిన్ కాజల్ (Kajal), శ్రీలీల (Sreeleela) ఈ ఎపిసోడ్‌కు హాజరయ్యారు. సినిమా విషయాలతో పాటు ఈ ప్రోమోలో బాలయ్య వదిలిన పొలిటికల్ సెటైర్ ఓ అణుబాంబ్‌లా పేలింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు సంబంధించి.. బాలయ్య ఓ పొలిటికల్ డైలాగ్ పేల్చారు. ‘సినిమా అయినా, లైఫ్‌లో అయినా.. అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి’ అంటూ బాలయ్య పేల్చిన డైలాగ్ ఎవరి గురించి అయి ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చూస్తుంటే ఈ షోలో బాలయ్య ఇంకాస్త గట్టిగానే.. అస్త్రాలు సంధించినట్లుగా అయితే ఈ డైలాగ్‌తో అర్థమవుతోంది.


ఇక సినిమాకు సంబంధించి ‘భగవంత్ కేసరి’ టీమ్‌ని హోస్ట్‌గా బాలయ్య ఓ ఆట ఆడించేశారు. ముఖ్యంగా అనిల్ రావిపూడిని అయితే కింద కూర్చోబెట్టేశారు. ఇక కాజల్‌ని.. ‘మోక్షుతో కూడా చేస్తావా?’ అని అడగగానే, ఆమె ‘100 పర్సంట్ చేస్తా’ అని సమాధానమిచ్చింది. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు.. చేస్తే బాలకృష్ణతో చేయాలి? లేదంటే శ్రీలీలతో సినిమా చేయాలని అంటున్నారు.. అంటూ శ్రీలీల రేంజ్ ఏంటో బాలయ్య చెప్పేశారు. కాజల్ కుమారుడు పాలు తాగకపోయినా, ఏడుపు ఆపకపోయినా నా ఫొటో చూపించి ఉంటావుగా? అంటూ కాజల్‌ని ఆట పట్టించారు. మొత్తంగా అయితే ఇది లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పారు కానీ.. ఇందులో ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్ల కంటే కూడా రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనే విషయం ఈ ప్రోమోతో తెలిసిపోతుంది. (Unstoppable With NBK Season 3 Episode 1 Promo Out)


మళ్లోచ్చిండు మన చిచ్చా.. మరింత అల్లరితో.. మరింత సందడితో.. ఫుల్ మీల్స్ వచ్చే లోపు, ఈ స్వీట్ ప్రోమో ఎంజాయ్ చేయండి అంటూ.. ఆహా యూనిట్ వదిలిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రోమోలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఫుల్ ఎపిసోడ్ దసరా ముందు అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుందని ఆహా (Aha OTT) అధికారికంగా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ వచ్చిన రెండు రోజులకే అంటే.. అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari Release Date) చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అంటే.. ఈ దసరాకి నందమూరి ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకాని బాలయ్య సిద్ధం చేశారన్నమాట.


ఇవి కూడా చదవండి:

============================

*University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఏమన్నారంటే..

*********************************

*Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

***********************************

*Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

***********************************

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

Updated Date - 2023-10-13T22:20:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!