University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ హ్యాపీ..

ABN , First Publish Date - 2023-10-13T21:27:29+05:30 IST

స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘యూనివర్సిటీ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఈ సినిమాకు వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ హ్యాపీ..
R Narayana Murthy

స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి (People Star R Narayana Murthy) నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (University). ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుంటుండటంతో.. ఆర్. నారాయణ మూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసిన వారంతా.. చాలా మంచి సినిమా అంటుంటే చాలా చాలా ఆనందంగా ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షక దేవుళ్ళకు వందనాలు. ఈ సినిమా విడుదల కంటే ముందు ప్రివ్యూ చూసి.. సినిమా బాగుందని చెప్పిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రొఫెసర్ హర గోపాల్‌గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య‌గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ‌గారు.. ఇలా ఒక్కరేమిటి చూసిన అందరూ.. సినిమాని ఓన్ చేసుకున్నారు. వారందరికీ ఈ సినిమా నచ్చింది. నా నమ్మకం నిజమైంది. ఈ సినిమా ప్రతి ఒక్క విద్యార్థి, వారి తల్లిదండ్రులు చూడాలి. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన సినిమా ఇది. (R Narayana Murthy About University)


RNM.jpg

ఇప్పుడు ఎక్కడ విన్నా పేపర్ లీకేజ్ అంటూ వార్తలే. గ్రూప్ వన్, గ్రూప్ 2 వంటి పరీక్షలలోనూ పేపర్ లీకేజ్‌లు. ఇలా అయితే విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి. పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. మనందరిపై, ప్రభుత్వాలపై ఉందనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అందరూ తప్పక చూడండి. ఎడ్యుకేషన్ మీద వచ్చే ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరూ చూడాలి.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

***********************************

*Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

***********************************

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

*Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

***********************************

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

Updated Date - 2023-10-13T21:29:00+05:30 IST