Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

ABN , First Publish Date - 2023-10-13T20:51:42+05:30 IST

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కుమార్తె, హీరోయిన్‌ శృతిహాసన్‌ ‘ది ఐ’ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు ఎంతో స్పెషల్‌ అని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సలార్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ శృతిహాసన్ మాత్రం.. తాను నటించిన ఆంగ్ల చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది.

Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు
Shruti Haasan

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కుమార్తె, హీరోయిన్‌ శృతిహాసన్‌ (Shruti Haasan) ‘ది ఐ’ (The Eye) అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు ఎంతో స్పెషల్‌ అని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సలార్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ శృతిహాసన్ మాత్రం.. తాను నటించిన ఆంగ్ల చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా గురించి శృతిహాసన్‌ స్పందిస్తూ.. 1980లో నటిస్తున్నట్టుగా ఈ స్ర్కిప్టు ఉంది. భార్యభర్తలు మృతి చెందిన తర్వాత వారి అస్థికలను నీటిలో కలిపేందుకు గ్రీక్‌ దీవికి వెళతారు. అక్కడ అనుకోకుండా జరిగిన కొన్ని స్పై సంఘటనలే ఈ చిత్ర స్టోరీ. ఇందులో అన్నా సెవ్వా, లిండో మార్లో తదితరులతో కలిసి నటించానని చెప్పుకొచ్చింది.

ఇదిలావుంటే, ఈ సినిమా పోస్టర్‌ను తన సోషల్‌ మీడియా ఖాతాలో రిలీజ్‌ చేసిన శృతి... ‘ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్‌. విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి డాప్ని స్మాన్‌ (Daphne Schmon) దర్శకత్వం వహించారు. గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుని.. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవార్డులను కైవసం చేసుకుంది. లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపికైంద’ని ఆమె వివరించారు. ఇలా.. తను నటించిన ఈ హాలీవుడ్ సినిమా గురించి సోషల్ మీడియాలో వరసబెట్టి పోస్ట్‌లు చేస్తుంది శృతి. అయితే ఈ సినిమా కథ గురించి ఆమె చెప్పిన వివరాలతో.. శృతిహాసన్ స్టోరీ లీక్ చేసిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.


Shruti-Haasan.jpg

ఈ హాలీవుడ్ ఫిల్మ్‌తో పాటు శృతిహాసన్ చేస్తున్న ‘సలార్’ సినిమాపై భారీగా అంచనాలను ఉన్నాయి. ఈ సినిమాతో ఆమె మళ్లీ బిజీ నటిగా మారుతుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శృతిహాసన్‌కు సరైన అవకాశమే రావడం లేదు. అందుకు కారణం ఆ మధ్య ఆమె గ్యాప్ తీసుకోవడమే. గ్యాప్ తర్వాత ఇచ్చిన రీ ఎంట్రీలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలలో నటించి.. హిట్ అందుకున్నప్పటికీ ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ‘సలార్‌’ (Salaar)తో పాటు నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రంలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

***********************************

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

*Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

***********************************

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

Updated Date - 2023-10-13T20:52:07+05:30 IST