Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-10-13T20:18:00+05:30 IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ట్యాగ్‌లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను దసరా రోజు చెప్పబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్‌కు సిద్ధమైంది.

Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?
Vrushabha Movie Team

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా (Rohan Meka) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ (Vrushabha). ‘ది వారియర్ అరైజ్’ (The Warriors Arise) అనేది ట్యాగ్‌లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నంద కిషోర్ (Nanda Kishore) దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.

రోజు రోజుకీ అంచనాలను పెంచుకుంటూ అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించేలా మేకర్స్ సన్నాహాలు చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘వృషభ’ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తికి తెరదించేలా.. దసరా రోజున ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. (Vrushabha Worldwide Theatrical Release Date Announcement Soon)


Vrushabha.jpg

మోహన్ లాల్, రోషన్ మేకా, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేదిల కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన, హాలీవుడ్‌కి చెందిన నిక్ తుర్లో నిక్ తుర్లోని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు. బాహుబలి, మన్యం పులి, ది బాస్, గజిని, రోబో, పుష్ప ది రైజ్ వంటి సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌తో ‘వృషభ’ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

*Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

***********************************

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

***********************************

Updated Date - 2023-10-13T20:20:21+05:30 IST