Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

ABN , First Publish Date - 2023-10-13T18:00:16+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, నేష‌న‌ల్‌ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ‘యానిమల్’. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ కాగా, ఇందులో కిస్ సీన్లు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా అనుకున్నప్పుడు మొదట సమంతను అనుకున్నారట. ఇప్పుడామె సేఫ్ అయిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది
Rashmika Mandanna and Ranbir Kapoor

రెండు రోజుల నుంచి ఒక సినిమా పోస్ట‌ర్, ఓ వీడియో సాంగ్‌ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ విషయం తెలిసిందే. దానికి కార‌ణం ఓ బాలీవుడ్ చిత్రం. అప్పుడెప్పుడో ఐదేండ్ల క్రితం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) పోస్ట‌ర్ విడుద‌ల చేసిన‌ప్పుడు ఎలా అయితే ర‌చ్చ జ‌రిగిందో, ఇప్పుడు దానికి రెండింత‌లు ఈ సినిమా విష‌యంలో జ‌రుగుతున్న‌ది. ఇంతకీ ఏ సినిమా అని అనుకుంటున్నారా? మ‌న తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన ‘యానిమ‌ల్’ (Animal) చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor), నేష‌న‌ల్‌ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం.. సందీప్ పేరు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచే వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. హాలీవుడ్ జాన్‌విక్ రేంజ్‌లో భారీ యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ని.. అందుకే ఈ పేరు పెట్టార‌నేలా బాగా ప్ర‌చారం జ‌రిగింది. కాగా తాజాగా విడుద‌ల చేసిన ఫొటో, వీడియోల‌తో ఇందులో ఘాటు రొమాన్స్ కూడా అంత‌కుమించి ఉంటుంద‌న్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి, తాజాగా విడుదలైన పాట గురించి నెటిజ‌న్లు కొందరు ఆస‌క్తిక‌రమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం మొద‌ట స‌మంత‌ (Samantha)ను అప్రోచ్ అయ్యార‌ని, ఆమె రిజెక్ట్ చేయ‌డంతో ర‌ష్మికను తీసుకున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు సోష‌ల్‌ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నెటిజ‌న్లు కూడా ఈ వార్త‌లపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ముద్దు సీన్లు.. అవి చూసిన చాలా మంది స‌మంత సేఫయింది, ర‌ష్మిక బుక్కయిదంటూ కామెంట్స్ చేస్తుండ‌గా.. స‌మంత చేసి ఉంటే మ‌రింత మ‌జా వ‌చ్చేదంటూ మ‌రికొంత‌మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగ చైత‌న్యతో విడాకుల అనంత‌రం చాలా ర‌కాలుగా ట్రోలింగ్‌ (Trolling)కు గురైన స‌మంత.. ఈ సినిమాను చేసి ఉంటే, ఆమె ఇమేజ్ మ‌రింత డ్యామేజ్ అయి ఉండేద‌ని, రిజెక్ట్ చేసి మంచి ప‌ని చేసింద‌ని అభిమానులు అనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత షాలిని పాండే (Shalini Pandey) పరిస్థితే.. ఇప్పుడు ‘యానిమల్’ తర్వాత రష్మిక (Rashmika) పరిస్థితి అవుతుందంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.


Rashmika-Mandanna.jpg

సమంత కనుక ఈ సినిమా ఓకే చేసి ఉంటే.. అప్ప‌టికే ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సిరీస్‌, ‘పుష్ప‌’ (Pushpa)లో ఐటం సాంగ్‌ చేసి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోన్న స‌మంతపై ఇప్పుడు ట్రోలింగ్ మ‌రో రేంజ్‌లో ఉండేద‌ని అంటున్నారు. మరీ ముఖ్యంగా చైత‌న్య విడాకులు ఇచ్చి మంచి ప‌ని చేశాడ‌నేలా వార్త‌లు వ‌చ్చేవ‌ని, ఆ చిత్రానికి అప్పుడు నో చెప్ప‌డం ఆమె కెరీర్‌కు ఉప‌యోగప‌డింద‌నేలా అభిమానులు అభిప్రాయప‌డుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత మ‌యోసైటిస్ వ్యాధికి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ విశ్రాంతిలో ఉండగా.. ఆమె చివ‌ర‌గా న‌టించిన ‘సిటాడెల్’ పాన్ ఇండియా సిరీస్ విడుద‌ల కావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

============================

*Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

***********************************

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

***********************************

* Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్

***********************************

Updated Date - 2023-10-13T18:02:30+05:30 IST