కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు.. ‘వీడు’

ABN, First Publish Date - 2023-09-21T22:41:43+05:30

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్.. మ్యాసియస్ట్ సాంగ్ ‘వీడు’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Ravi Teja in Tiger Nageswara Rao

పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) టీజర్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) పాత్రను పరిచయం చేయగా, ట్రైలర్ అతిపెద్ద గజదొంగ వరల్డ్‌కి తీసుకెళ్లింది. ఫస్ట్ సింగిల్ ‘ఏక్ దమ్’ రొమాంటిక్ సైడ్ చూపించింది. ఇప్పుడు విడుదలైన సెకెండ్ సింగిల్ ‘వీడు’ టైగర్ పాత్రను వివరిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్ బీట్‌లతో కూడిన మ్యాసియస్ట్ పాటను స్కోర్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన లిరిక్స్ లార్జర్ దేన్ లైఫ్‌గా మాస్‌ని ఆకట్టుకునేలా ఉండగా.. సింగర్ అనురాగ్ కులకర్ణి తన పవర్ ఫుల్ వాయిస్‌తో పాటకు మరింత ఎనర్జీ జోడించారు. (Tiger Nageswara Rao Second Single Out)

అలాగే ఈ పాటలో విజువల్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. ఫైర్ ఎఫెక్ట్స్, రావిష్ మేకింగ్, గ్రే టోన్ ఇంటెన్స్‌ని రెట్టింపు చేశాయి. లిరికల్ వీడియోను బట్టి చూస్తే, రవితేజ కనికరం లేని గజదొంగగా నటించారని, ఎవరైనా తన దారికి అడ్డువస్తే వదిలిపెట్టరని స్పష్టమవుతోంది. దర్శకుడు వంశీ మ్యాసియస్ట్ అవతార్‌‌లో పాత్రను ప్రెజెంట్ చేశాడు. రవితేజను ఇలాంటి ఫెరోషియస్ పాత్రలో చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు తమ బలమైన హావభావాలతో రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చారు. ఈ పాట మాస్‌ని కట్టిపడేస్తుంది. పూర్తి విజువల్స్‌తో పాటను బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడు మరింత జోష్‌ను వస్తుందనడంలో సందేహమే లేదు. (Tiger Nageswara Rao Veedu Lyrical Song)


ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ను వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ చిత్రాలను రూపొందించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ

*******************************

*Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..

*******************************

*Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

******************************

*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

********************************

*Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

*******************************

Updated Date - 2023-09-21T22:41:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!