Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..

ABN , First Publish Date - 2023-09-21T21:41:36+05:30 IST

కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘కేబుల్ రెడ్డి’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..
Suhas in Cable Reddy

కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ (Suhas). ప్రస్తుతం ఆయన హీరోగా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘కేబుల్ రెడ్డి’ (Cable Reddy). ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (Cable Reddy First Look Out)

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుహాస్‌ని ‘కేబుల్ రెడ్డి’గా మేకర్స్ ప్రజంట్ చేశారు. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ చూస్తుంటే సుహాస్ కేబుల్ డిష్ ఓనర్‌గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. పోస్టర్‌లో 2000వ దశకం ప్రారంభంలో వాడిన చాలా పోర్టబుల్ టీవీలు కనిపిస్తున్నాయి. సుహాస్ షేడ్స్‌ ధరించి చిరునవ్వుతో వాటిపై సేదతీరుతున్నట్లు కనిపించారు. సినిమా ఫన్ రైడ్‌గా వుండబోతుందని హామీ ఇచ్చేలా పోస్టర్‌‌ని డిజైన్ చేశారు. ఇందులో సుహాస్ ఎరుపు చొక్కా, నలుపు ఫార్మల్ ప్యాంట్‌లో సాధారణ గ్రామ యువకుడిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. (Cable Reddy Movie)


Cable-Reddy.jpg

ఈ సినిమాలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణులను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

******************************

*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

********************************

*Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

*******************************

*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..

******************************

Updated Date - 2023-09-21T21:41:36+05:30 IST