Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

ABN , First Publish Date - 2023-09-21T17:55:36+05:30 IST

విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతూ.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన అనసూయ తాజాగా ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసింది.

Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..
Anasuya

విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా పరిచయం అవుతూ.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ (Peddha Kapu 1). ‘అఖండ’ (Akhanda)తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ అయితే సినిమాపై అమాంతం అంచనాలని పెంచేసింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘పెదకాపు 1’.. ఈ సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?

ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇప్పుడే ఆ పాత్ర పేరు, స్వభావం గురించి పూర్తిగా చెప్పకూడదు. ప్రేక్షకులు పెదకాపు ప్రపంచంతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్‌గా వుంటుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం వుంది.

‘రంగస్థలం’లో రంగమ్మత్త తర్వాత మళ్ళీ అలాంటి పాత్ర మీ నుంచి రాలేదు కదా..?

‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పాత్ర ఒక బార్‌ని సెట్ చేసింది. అయితే.. నేను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా వుంటుంది. పెదకాపు రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా వున్నాయి. (Anasuya Interview about Peddha Kapu 1)


Anausya-3.jpg

ఈ సినిమాలో మిమ్మల్ని డీవోపీ ఛోటా కె నాయుడు (Chota K Naidu) గారు రిఫర్ చేశారని విన్నాం.. నిజమేనా?

అవును. సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో చేశాను. ఆ సినిమా చూసి ఛోటా గారు ఫోన్ చేశారు. ‘నీకొక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను కానీ కన్సిడర్ చెయ్’ అని చెప్పారు. శ్రీకాంత్ గారు ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. ప్రగతి, బ్రిగడ, ఈశ్వరీరావు.. ఇలా ఇందులో స్త్రీ పాత్రలన్నీ చాలా బలంగా వుంటాయి.

శ్రీకాంత్ అడ్డాల నుంచి ఇలాంటి కథని ఊహించారా?

అస్సలు ఊహించలేదు. శ్రీకాంత్ గారంటే .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం.. ఇలాంటి హోమ్లీ ఇంప్రెషన్ వుంటుంది. అలాంటి శ్రీకాంత్ గారు పెదకాపు లాంటి కథ చెప్పినపుడు షాక్ అయ్యా. దర్శకుడిగా ఆయనకి ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్.

శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) ఇందులో నటించడం ఎలా అనిపించింది?

నిజంగా ఇది బిగ్ సర్‌ప్రైజ్. కథ విన్నప్పుడు శ్రీకాంత్‌గారు నటిస్తున్నారని నాకు తెలీదు. నిజానికి ప్రతి దర్శకుడిలో ఒక నటుడు వుంటారు. ఇలా చేయాలని, అలా చేయాలని మొదట చేసి చూపించేది దర్శకులే. శ్రీకాంత్ గారు చాలా ఈజ్‌తో ఆ పాత్రని చేశారు. ప్రేక్షకులు కూడా సర్‌ప్రైజ్ అవుతారు.

ఇందులో మీ పాత్ర కోసం ప్రత్యేకమైన మేకోవర్ అయ్యారా?

పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ వుంది. మేకోవర్‌లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఈ సినిమా చాలా మంచి అనుభవం. (Anasuya about Peddha Kapu 1)


Anasuya-1.jpg

కొత్త హీరో విరాట్ కర్ణ‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

విరాట్ కర్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్‌లో చాలా దెబ్బలు కూడా తగిలాయి. తనది చాలా మంచి మనస్తత్వం. ఇందులో తన పాత్ర చాలా ఫెరోషియస్‌గా వుంటుంది. ట్రైలర్ చూసిన చాలా మంది తనని ప్రభాస్ గారి‌తో పోల్చారు. ప్రభాస్ గారంటే విరాట్‌కి చాలా ఇష్టం. విరాట్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకముద్ర వేసుకుంటాడనే నమ్మకం వుంది. ఇందులో ప్రతి పాత్రతో నాకు కాంబినేషన్ సీన్లు వున్నాయి. ప్రతి పాత్ర కథలో కీలకంగా వుంటుంది.

నిర్మాతల గురించి?

ద్వారక క్రియేషన్స్ నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థలలో ఒకటి. మిర్యాల రవీందర్‌రెడ్డి గారు ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఇందులో నేను చేసిన పాత్ర కోసం మిగతా భాషల నుంచి కూడా కొందరిని అనుకున్నారు. అలాంటి బలమైన పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాననే తృప్తి వుంది.

ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు ?

అన్ని రకాల పాత్రలు చేస్తాను. అమ్మమ్మ పాత్ర కూడా చేస్తాను. అయితే.. ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా వుండాలి.


Anasuya-2.jpg

ఇవి కూడా చదవండి:

============================

*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..

******************************

*Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..

***********************************

*Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..

**********************************

*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్

*********************************

*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

*************************************

Updated Date - 2023-09-21T17:55:36+05:30 IST