Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

ABN , First Publish Date - 2023-09-21T19:11:33+05:30 IST

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాల ఘన విజయం తర్వాత.. రీసెంట్‌గా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’‌తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి ఆయన నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా సక్సెస్‌తో వచ్చిన హ్యాపీనెస్‌ని నవీన్ మీడియాతో పంచుకున్నారు.

Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాల ఘన విజయం తర్వాత.. రీసెంట్‌గా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’‌ (Ms Shetty Mr Polishetty)తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty)తో కలిసి ఆయన నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది. థర్డ్ వీక్‌లోనూ గ్లోబల్‌గా స్టడీ కలెక్షన్స్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ప్రేక్షకుల ప్రేమతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ తనకు ఇచ్చిన హ్యాపీనెస్ గురించి తెలిపేందుకు హీరో నవీన్ పోలిశెట్టి.. గురువారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు ‘జవాన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో పోటీ పడుతున్నాం.. బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. మేము మంచి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని తెలుసు. కానీ సోలోగా వస్తే బాగుండేది కదా అనిపించింది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్‌తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కాస్త స్లోగా ఉన్నా.. యూఎస్‌లో డల్లాస్‌లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్‌గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్‌లో కూడా యూఎస్‌లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. వాస్తవంగా మూడో వారంలో యూఎస్‌లో సినిమా ఉండదు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఆడియెన్స్ డిమాండ్ మేరకు షోస్ పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థర్డ్ వీక్‌లో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మేము చేసిన మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. (Naveen Polishetty Chit Chat with Media)


Naveen-1.jpg

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి‌గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా నటన గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్, ప్రభాస్, సమంత.. ఇంకా ఎందరో చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్‌కు జర్నీ చేస్తూ.. ఫ్లైట్‌లోనే నిద్రపోయేవాడిని. హోటల్‌లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. నాకది కష్టం అనిపించలేదు.

ఇప్పటి వరకు నాకు దక్కిన మూడు సక్సెస్ ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్‌కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. నా ఫస్ట్ మూవీకి ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. అవి చూసి బాగున్నాయి అన్నా ఎవరూ నామీద ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. అలా మొదట వచ్చింది మా ఏజెంట్ సాయి శ్రీనివాస ప్రొడ్యూసర్. ఆ సినిమా నేను బాగా పర్‌ఫార్మ్ చేయగలను అని ప్రూవ్ చేసింది. ‘జాతి రత్నాలు’ టైమ్‌లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్‌లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి.. నవీన్ సినిమా థియేటర్‌లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్‌లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నా. (Naveen Polishetty Interview)


Naveen-2.jpg

ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం బాగా ప్రిపేర్ అయ్యాను. స్టాండప్ కమెడియన్స్‌ను బాగా అబ్జర్వ్ చేశా. సినిమాలు చూడకముందే చాలా మంది తమ అభిప్రాయాలు చెబుతుంటారు. కానీ చూసిన తర్వాతే సరైన రివ్యూ వస్తుందని నా నమ్మకం. అలా ఈ సినిమాకు బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే పేరు వచ్చింది. నా మొదటి సినిమా ఏజెంట్ అప్పుడు కూడా డిటెక్టివ్ సినిమాలు మన దగ్గర ఆడవు అన్నారు. ఏదైనా సక్సెస్ కాకుంటే ఎందుకు కాలేదని నేను ఆలోచిస్తా. ఈ సబ్జెక్ట్‌కు స్లోగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుసు. మాస్ కమర్షియల్ సినిమా అయితే ఆడియెన్స్ అలవాటు పడి ఉంటారు కాబట్టి వెళ్తారు. మేము కొత్త సెన్సిటివ్ పాయింట్ చెప్పాం. దాంతో మెల్లిగా మా మూవీ జర్నీ మొదలైంది. సినిమాలో చివరి 30 మినిట్స్ చేసిన పర్‌ఫార్మెన్స్ నేను గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎమోషన్, డ్రామా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రీసెంట్‌గా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సినిమా చూశా. ఒక పెద్దావిడ 80 ఏళ్లుంటాయి. వాళ్ల అబ్బాయితో వచ్చి మూవీ చూసింది. ఆమె 15 ఏళ్లుగా సినిమాలు చూడలేదట. మా సినిమా ఆమెకు బాగా నచ్చిందని చెప్పింది. నటుడిగా ప్రతి సీన్‌ను సెట్‌లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్‌లో నాలుగు జోక్స్ ఉంటే.. నేను చేసేటప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. మరుసటి రోజు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా. (Naveen Polishetty About MSMP Success)

Naveen-3.jpg

ప్రతి భాషలో నాకు ఫేవరేట్ యాక్టర్స్ ఉన్నారు. హిందీలో అమీర్ ఖాన్ ఇష్టం. అలాగే తెలుగులో చిరంజీవిగారు, ప్రభాస్‌గారు. అన్ని జానర్స్ మూవీస్ ఇష్టపడతా. హిందీలో రాజ్ కుమార్ హిరాణీ గారి మూవీస్ ఇష్టం. తెలుగులో ‘భైరవ ద్వీపం, ఆదిత్య 369’ నా ఫేవరేట్ మూవీస్. ప్రతి మూవీ సక్సెస్ నాపై హీరోగా బాధ్యత పెంచుతుంటుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. నెక్ట్ ఇయర్ మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. టైమ్ దొరికితే కపిల్ షో లాంటి మంచి హ్యూమరస్ టీవీ ప్రోగ్రాం చేయడానికి రెడీ. అయితే సినిమాలతోనే టైమ్ సరిపోతుంది’’ అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చారు. (Young Hero Naveen Polishetty)


ఇవి కూడా చదవండి:

============================

*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

********************************

*Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

*******************************

*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..

******************************

*Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..

***********************************

Updated Date - 2023-09-21T19:11:33+05:30 IST