Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-14T09:57:55+05:30 IST

ఇప్పటివరకు కమర్షియల్‌ హీరో సరసన నటించే అవకాశం రాలేదని ఒక వేళ వస్తే మాత్రం వదులుకోనని హీరోయిన్‌ తాప్సీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా ఉన్న తాప్సీ... తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతోంది.

Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు
Taapsee Pannu

ఇప్పటివరకు కమర్షియల్‌ హీరో సరసన నటించే అవకాశం రాలేదని ఒక వేళ వస్తే మాత్రం వదులుకోనని హీరోయిన్‌ తాప్సీ పన్ను (Taapsee Pannu) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా ఉన్న తాప్సీ (Taapsee)... తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో చిట్‌చాట్‌ (Chit Chat with Fans)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది.

‘‘కమర్షియల్‌ హీరోల (Commercial Heroes) సరసన నటించాలనే ఆశ నాకూ ఉంది. కానీ, అవకాశం రావడం లేదు. ఇకపై వస్తే వదులుకోను. నా వరకు చిన్న చిత్రాల్లో నటించడమే ఆత్మసంతృప్తిగా ఉంటుంది. రెమ్యునరేషన్‌ (Remuneration) తక్కువగా ఇచ్చినప్పటికీ చిన్న చిత్రాల్లో నటించడం వల్ల ఆత్మతృప్తి లభిస్తుంది. పైగా చిన్న సినిమాల్లో స్ర్కిప్టు మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. నా కోసమే సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్‌కు వెళతారు. ఆ ఫీలింగ్‌ ఇచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేం. తెలుగు చిత్రాల్లో నటించకపోవడానికి కారణం సరైన కథలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అవి నచ్చడం లేదు. స్టోరీ నచ్చకపోతే అది ఏ భాషా చిత్రమైన నటించే ప్రసక్తే లేదు’’ అని తాప్సీ స్పష్టం చేసింది.


Taapsee.jpg

తాప్సీ ఇచ్చిన ఈ సమాధానంతో ప్రేక్షకులు, నెటిజన్లు కొందరు ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోల సరసన అంటే.. రవితేజ (Ravi Teja) సరసన నటించావుగా.. ఆయన కమర్షియల్ హీరో కాదా? అంటూ ఇంకొందరి హీరోల పేర్లను లేవనెత్తుతున్నారు. అయినా తాప్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. డౌన్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా మాట్లాడి వార్తలలో నిలవడం ఈ మధ్య హీరోయిన్లకు అలవాటైపోయింది. అలా ఇప్పుడు తాప్సీ కూడా కావాలని కాంట్రవర్సీ అయ్యేందుకు ఇలా సమాధానం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..

************************************

*UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

********************************

*University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఏమన్నారంటే..

*********************************

*Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

***********************************

*Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

***********************************

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

Updated Date - 2023-10-14T09:57:55+05:30 IST