KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..

ABN , First Publish Date - 2023-10-13T22:46:39+05:30 IST

‘కేసీఆర్’ పేరుతో ఇప్పుడొక సినిమా రాబోతోంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై ‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘గరుడవేగ’ వంటి ఎన్నో చిత్రాలకు డీవోపీ‌గా పని చేసిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..
KCR Movie Poster

‘కేసీఆర్’ (KCR) పేరుతో ఇప్పుడొక సినిమా రాబోతోంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ (Green Tree Productions) ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ (Vibudhi Creations) పతాకంపై ‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘గరుడవేగ’ వంటి ఎన్నో చిత్రాలకు డీవోపీ‌గా పని చేసిన అంజి (Garudavega Anji) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) చేతులు మీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్‌తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో శుక్రవారం టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ‌ (Mamidi Harikrishna)తో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. (KCR Movie Title Launch)


Rocking-Rakesh-KCR.jpg

ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన అనన్య (Ananya) హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, కృష్ణభగవాన్, ధనరాజ్ తో పాటు తాగుబోతు రమేష్, రచ్చరవి, జోర్ధార్ సుజాత, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ (Charan Arjun) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా పని చేస్తున్నారు. బలగం మధు (Balagam Madhu) ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి బత్తుల మహేష్ (Bathula Mahesh) ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

********************************

*University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఏమన్నారంటే..

*********************************

*Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

***********************************

*Vrushabha: రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఎప్పుడంటే?

***********************************

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

Updated Date - 2023-10-13T23:09:00+05:30 IST