Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు

ABN , First Publish Date - 2023-08-05T14:44:07+05:30 IST

స్టార్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆమెనే స్వయంగా మీడియా ముఖంగా తెలియజేశారు. అయితే ఆమె బాధపడుతోన్న వ్యాధికి చికిత్స నిమిత్తం ఓ స్టార్ హీరో రూ. 25 కోట్లు సాయం చేశాడని వినిపిస్తున్న వార్తలపై తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అవి కేవలం వదంతులే మాత్రమే అనేలా సమంత వివరణ ఇచ్చారు.

Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు
Samantha

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా ‘మయోసైటిస్’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆమెనే స్వయంగా మీడియా ముఖంగా తెలియజేశారు. ఆమె నటించిన ‘యశోద’ (Yasodha) ప్రమోషన్స్ సమయంలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత కూడా ఆ వ్యాధితో బాధపడుతూనే షూటింగ్స్‌లో పాల్గొనడమే కాకుండా.. ఆ చిత్ర ప్రమోషన్స్‌‌లో పాల్గొన్నారు. తాజా ఆమెకున్న అనారోగ్యానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. సమంత ‘మయోసైటిస్’ చికిత్సకు టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో రూ. 25 కోట్లు (Rs. 25 Crores) సాయం చేశారనేలా.. వైరల్ అవుతున్న వార్తకి తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.


‘మయోసైటిస్’ చికిత్స నిమిత్తం వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని.. తనకంత అవసరం లేదని.. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తనకు తెలుసనేలా సమంత క్లారిటీ ఇచ్చారు. ‘‘మయోసైటిస్‌ చికిత్సకు రూ.25 కోట్లా? ఎవరో మీకు తప్పుగా సమాచారం ఇచ్చారు. మీరు చెప్పిన అమౌంట్‌లో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే దీనికోసం ఖర్చు చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. నా కెరీర్‌లో ఇప్పటివరకూ పని చేసినదానికి ఫలితంగా రాళ్లూరప్పలు తీసుకోలేదనే అనుకుంటున్నా. కాబట్టి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను.. ధన్యవాదాలు. మయోసైటిస్‌ వ్యాధిలో ఎన్నో వేల మంది బాధపడుతున్నారు. ఆ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఇచ్చే సమాచారంలో.. దయచేసి కాస్త బాధ్యతగా వ్యవహరించండి’’ అని సమంత తన ఇన్‌స్టాగ్రమ్ స్టోరీ‌లో పేర్కొన్నారు. (Samantha about Star Hero Financial Help)

Samantha-Pic.jpg

సమంత ఇచ్చిన ఈ క్లారిటీ.. ఈ వార్తను పుట్టించిన గాసిప్ రాయుళ్లకు సరిపోతుందనే అనుకోవాలి. ఆమె చెప్పినట్లుగా నిజంగా రూ. 25 కోట్లు అంటే.. ఆ వ్యాధి ఉన్నవాళ్లు.. ఆ ఫిగర్ చూసే ముందు హార్ట్ అటాక్ తెచ్చుకుంటారు. అందుకే సమంత లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిందని.. ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘ఖుషి’ (Kushi), ‘సిటాడెల్’ (Citadel) షూటింగ్స్‌ను పూర్తి చేసి.. ఇండోనేషియలోని బాలి టూర్‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్ల పాటు షూటింగ్స్ బ్రేక్ చెప్పిన సమంత (Heroine Samantha).. ఈ గ్యాప్‌లో తను ఫేస్ చేస్తున్న వ్యాధికి చికిత్స తీసుకోనున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bro: ఫ్యామిలీ ఆడియన్స్‌‌ కనెక్ట్ అయ్యారు.. ఈ వారం కూడా ‘బ్రో’దే బ్రో!


***************************************

*Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది

***************************************

*Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

**************************************

*Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

Updated Date - 2023-08-05T14:44:07+05:30 IST