Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

ABN , First Publish Date - 2023-08-04T15:01:03+05:30 IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘బ్రో డాడీ’ రీమేక్‌కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి‌‌కి కుమారుడిగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినబడుతూనే ఉన్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్‌లో శర్వానంద్‌ని ఓకే చేసినట్లుగా టాక్ వినబడుతోంది.

Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ (‘బ్రో డాడీ’ రీమేక్ అనుకుంటున్నారు కానీ.. కాదని తెలుస్తోంది) కాగా.. రెండోవది ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఉండబోతుందనేలా టాక్ నడుస్తుంది.


Also Read: చిరు చేస్తున్న సినిమా ‘బ్రో డాడీ’ రీమేక్ కాదు.. ఒరిజినలే. కథ ఎవరిచ్చారంటే..

అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమాకు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి‌‌కి కుమారుడిగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినబడుతూనే ఉన్నాయి. కానీ, రీసెంట్‌గా సిద్ధు ఈ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపడం లేదనేలా వార్తలు బయటికి వచ్చాయి. దీంతో ఆ ప్లేస్‌లో నటించే హీరో విషయంలో చాలా మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొడుకు పాత్రలో వరుణ్ తేజ్ (Varun Tej) అయితే న్యాచురల్‌గా బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తున్నప్పటికీ.. కార్తికేయ (Karthikeya), నితిన్ (Nithiin) ఇలా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడా ప్లేస్‌లో మరో యంగ్ హీరో పేరు యాడయింది. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్ (Sharwanand).

Chiru-and-Sharwa.jpg

శర్వానంద్‌కి మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న విషయం తెలియంది కాదు. రామ్ చరణ్ (Ram Charan), శర్వానంద్ మంచి స్నేహితులు. చిరంజీవి కూడా పలు సందర్భాలలో శర్వా నా బిడ్డలాంటి వాడని ప్రకటించారు. మా ఇంట్లోనే పెరిగాడని కూడా అన్నారు. చిరంజీవి ‘శంకర్‌దాదా MBBS’ చిత్రంలో శర్వానంద్ ఇప్పటికే నటించి ఉన్నారు. ఇప్పుడు మరోసారి శర్వాకి చిరు సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి కుమారుడి పాత్రలో శర్వానంద్ దాదాపు ఖరారు అయినట్లే అని తాజాగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా సమాచారం.


ఇవి కూడా చదవండి:

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

*Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

**************************************

*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..

**************************************

Updated Date - 2023-08-04T15:53:13+05:30 IST