Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

ABN , First Publish Date - 2023-08-05T11:40:24+05:30 IST

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది
Kangana Ranaut in Chandramukhi 2

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు (P Vasu) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. (Kangana Ranaut as Chandramukhi)


ఈ ఫస్ట్ లుక్ ను గమనిస్తే... చీరకట్టులో కంగనా తీక్షణంగా చూస్తోంది. చంద్రముఖిగా ఆమె లుక్‌ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. రీసెంట్‌గా వచ్చిన లారెన్స్‌ లుక్‌కు ధీటుగా కంగనా లుక్ ఉందని చెప్పవచ్చు. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది.

Chandramukhi2.jpg

భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ (Lyca Productions Subhaskaran) నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌‌పై చిత్రయూనిట్ దృష్టిపెట్టారు. అందులో భాగంగా ఇలా పాత్రలను పరిచయం చేస్తున్నారు. కంగనా రనౌత్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

Updated Date - 2023-08-05T11:40:24+05:30 IST