Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

ABN , First Publish Date - 2023-08-04T17:50:29+05:30 IST

మేనమామ, మేనల్లుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై మంచి టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని.. చిత్రయూనిట్ విజయయాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రకు వస్తున్న అభిమానులు బైక్స్‌పై వచ్చేటప్పుడు హెల్మెట్స్ ధరించాలని సాయితేజ్ కోరారు.

Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..
Sai Dharam Tej

మేనమామ, మేనల్లుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై మంచి టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని.. చిత్రయూనిట్ విజయయాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొంటూ.. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఈ యాత్రలో తనతో పాటు వచ్చే కొందరు అభిమానులు హెల్మెట్స్ లేకుండా బైక్స్‌పై ర్యాలీ చేస్తుండటం గమనించిన సాయితేజ్ సోషల్ మీడియా వేదికగా.. వారికి భద్రతలు తెలియజేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఏముందంటే.. (Sai Tej Letter on Bro Success Tour)


‘‘అందరికీ నమస్కారం,

Bro విజయయాత్రలో భాగంగా నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. అందరినీ కలుపుకోవడం, మీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం చాలా బావుంది. అయితే నన్ను కలవడానికి వచ్చేవారు ఫొటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికొస్తున్నారు. వీలైనంత మేరకు నేను అందరికీ అందుబాటులో ఉండటానికే ప్రయత్నిస్తున్నాను.

అయితే ఈ క్రమంలో చాలా మంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయటం, డైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ.. ఆ క్రమంలో మీకు ఎటువంటి హాని జరిగినా.. నాకు తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా.. బ్రోస్‌లా భావిస్తాను. మీ భద్రత నా బాధ్యత.

దయచేసి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరిచిపోకండి. నాకు మీ ప్రేమని పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి. అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను.. జైహింద్.. మీ సాయితేజ్’’ అని ఈ సుప్రీం హీరో సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

Updated Date - 2023-08-04T17:50:29+05:30 IST