Bro: ఫ్యామిలీ ఆడియన్స్‌‌ కనెక్ట్ అయ్యారు.. ఈ వారం కూడా ‘బ్రో’దే బ్రో!

ABN , First Publish Date - 2023-08-05T13:46:44+05:30 IST

గత వారం బాక్సాఫీస్‌కు కళ తెచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబో చిత్రం ‘బ్రో’.. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇక ఈ శుక్రవారం విడుదలైన సినిమాలేవీ సరైన టాక్‌ని సొంతం చేసుకోలేకపోవడంతో పాటు, ‘బ్రో’ కాన్సెఫ్ట్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుండటంతో.. ఈ వారం కూడా ‘బ్రో’ థియేటర్స్ ఆడియెన్స్‌తో కళకళలాడుతున్నాయి.

Bro: ఫ్యామిలీ ఆడియన్స్‌‌ కనెక్ట్ అయ్యారు.. ఈ వారం కూడా ‘బ్రో’దే బ్రో!
Bro Movie Still

గత వారం బాక్సాఫీస్‌కు కళ తెచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబో చిత్రం ‘బ్రో’ (Bro).. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇక ఈ శుక్రవారం విడుదలైన సినిమాలేవీ సరైన టాక్‌ని సొంతం చేసుకోలేకపోవడంతో పాటు, ‘బ్రో’ కాన్సెఫ్ట్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుండటంతో.. ఈ వీకెండ్ మరోసారి పవర్‌స్టార్, సుప్రీం హీరో తమ ప్రతాపాన్ని బాక్సాఫీస్ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ బుకింగ్స్ బాగుండటంతో.. చిత్రయూనిట్ కూడా హ్యాపీగా ఉంది.


వాస్తవానికి ఈ సినిమా విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా, మిక్స్‌డ్ టాక్ నడిచినా.. కలెక్షన్ల పరంగా ‘బ్రో’ దూసుకెళుతూనే ఉంది. ఈ వీకెండ్ చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తుండటం చూస్తుంటే.. ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ లిస్ట్‌లోకి చేరిపోవడం ఖాయం అని తెలుస్తోంది. సినిమాలోని కాన్సెఫ్ట్, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinvias) డైలాగ్స్, థమన్ సంగీతంతో పాటు నటీనటుల సహజ నటన సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మేనమామ, మేనల్లుడు కలిసి నటించడం, వారి ఇమేజ్ ఈ సినిమాని ప్రేక్షకులకు అత్యంత చేరువ చేస్తోంది.

Pawan-Kalyan.jpg

ZEE స్టూడియోస్‌తో కలిసి టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరు పొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమిళ నటుడు, దర్శకుడు, రచయిత అయిన పి. సముద్రఖని (P. Samuthirakani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పటికే రూ. 120+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమా కోసం సముద్రఖని సెట్ చేసిన ఎమోషనల్ స్టోరీ.. పవన్ కళ్యాణ్ చరిష్మా, సాయి ధరమ్ తేజ్ పరిణితి చెందిన నటన.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సాయితేజ్ నిర్వహిస్తోన్న టూర్ కూడా ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తోంది. (Bro Box Office Report)


ఇవి కూడా చదవండి:

***************************************

*Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది

***************************************

*Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

**************************************

*Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

Updated Date - 2023-08-05T13:46:44+05:30 IST