Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

ABN , First Publish Date - 2023-07-27T22:25:42+05:30 IST

శుక్రవారం ‘బ్రో’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్‌ను విడుదల చేశారు. అందులో ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు చేసుకునే సంబరాలలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు
Sai Dharam Tej

శుక్రవారం ‘బ్రో’ (Bro) సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్‌ను విడుదల చేశారు. అందులో ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు చేసుకునే సంబరాలలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని.. మసులుకోవాలని కోరారు. ఈ సంబరాల్లో మీకు ఏదైనా జరిగితే తట్టుకునేంత ధైర్యం నాకిప్పుడు లేదంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


‘‘ప్రియమైన అభిమానులకు, నా శ్రేయోభిలాషులకూ,

ఇప్పటిదాకా మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చాలా ధన్యవాదాలు. మీ అందరి అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

సముద్రఖనిగారి దర్శకత్వంలో నేను, కళ్యాణ్ మామయ్య కలిసి నటించిన ‘బ్రో’ (#BroTheAvatar) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల, ప్రతి కంటెంట్ గురించి మీరు ఆసక్తి కనబరిచి చిత్రం విడుదలకు ముందే బ్యానర్లు, కటౌట్‌లతో ఒక పండగలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇంకా చాలా విధాలుగా మీ అభిమానాన్ని చాలుతూ ఉన్నారు. మీరు ఇష్టంగా చేసుకునే సంబరాలను మేము కాదనలేము.

అయితే ఆ సమయంలో అతి జాగ్రత్తగా ఉండమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇప్పుడున్న వాతావరణాన్ని కూడా మదిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా మీ సంబరాలను జరుపుకోండి. ఈ సంబరాల్లో మీకు ఏదైనా జరిగితే తట్టుకునేంత ధైర్యం ఇప్పుడు నాకు లేదు. మీ ప్రేమను పొందాలని ఎంత ఉన్నా, మీరు సురక్షితంగా ఉండటం దాని కంటే ముఖ్యం అని నమ్ముతాను నేను. కాబట్టి దయచేసి సురక్షితంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జైహింద్.. మీ సాయితేజ్’’ అని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

**************************************

*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

Updated Date - 2023-07-27T22:32:55+05:30 IST