Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

ABN , First Publish Date - 2023-07-26T21:06:55+05:30 IST

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల డైమండ్ రింగ్ గిఫ్ట్‌ని తమన్నాకు ఇచ్చిందనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతా నిజమేనేమో అని అనుకోవడంతో.. ఇంకేముంది.. ఈ విషయం నెట్టింట్లో బాగా ట్రెండ్ అయ్యింది. కానీ అది డైమండ్ రింగ్ కాదని.. బాటిల్ ఓపెనర్ అంటూ తమన్నా ఆ రింగ్‌పై క్లారిటీ ఇచ్చింది.

Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా
Tamannaah Bhatia

కంటికి కనిపించేవి నిజాలు కావు.. ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుందిగా! అయినా సరే.. కొన్నిసార్లు కంటికి కనిపించినవి నిజమేనని కొందరు నమ్మేస్తుంటారు. అసలే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న రోజులివి. ఏదైనా ఒక విషయం బయటకు పొక్కితే.. క్షణాల్లోనే వైరల్ అయిపోతాయి. దీంతో.. ఫలానా విషయంలో నిజానిజాలేంటనేది తెలుసుకోకుండా, కళ్లతో చూసిందే నిజమని ఫిక్సైపోతుంటారు. సరిగ్గా ఇలాంటి పొరపాటే మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) విషయంలో కూడా జరిగింది. అదేమిటంటే..


అప్పట్లో తమన్నా చేతి వేలుకి ఒక పెద్ద డైమండ్ రింగ్ ఉన్న పోస్టర్‌ని షేర్ చేసిన ఉపాసన.. ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ (Ram Charan).. ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ డైమండ్ రింగ్ (Diamond Ring) ఖరీదు రూ.2 కోట్లు అని.. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) ఈ ఖరీదైన గిఫ్ట్‌ని తమన్నాకు ఇచ్చిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అంతా నిజమేనేమో అని అనుకోవడంతో.. ఇంకేముంది.. ఈ విషయం నెట్టింట్లో బాగా ట్రెండ్ అయ్యింది. అసలు అంత ఖరీదైన గిఫ్టును ఉపాసన ఎందుకు ఇచ్చి ఉంటుంది? అనే చర్చలు జోరుగా సాగాయి.

Tamanna.jpg

ఇక దీనిపై తమన్నా ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ ఫోటో ఇప్పటిది కాదు.. తమన్నా.. చిరంజీవి (Chiranjeevi) సరసన నటించిన ‘సైరా’ (Sye Raa) సినిమా షూటింగ్ సమయంలోనిది. అప్పట్లోనే ఈ ఫోటో ట్రెండ్ అవ్వగా.. ఇప్పుడు మరోసారి ఇది వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా.. ఈ డైమండ్ రింగ్‌కు సంబంధించి తాజాగా షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేసింది. ‘‘నాకిది చెప్పడం ఇష్టం లేదు కానీ, చెప్పక తప్పట్లేదు. ఆ డైమండ్ రింగ్ నిజమైనది కాదు, అది ఒక బాటిల్ ఓపెనర్. దాంతో మేము ఫొటోషూట్ చేశాం’’ అంటూ కుండబద్దలు కొట్టింది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

Updated Date - 2023-07-26T21:30:06+05:30 IST