Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

ABN , First Publish Date - 2023-07-27T18:09:23+05:30 IST

యాంగ్రీ‌మెన్ రాజశేఖర్ డ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. రాజశేఖర్ ప్రస్తావన వచ్చిందంటే చాలు.. కచ్చితంగా ఆయన డ్యాన్స్‌ గురించి మాట్లాడకుండా ఉండరు. ఆయన వేసే డ్యాన్స్‌కు అభిమానులేమోగానీ.. ఇతర హీరోలని మాత్రం ఆ డ్యాన్స్ బాగా ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన ‘భోళా శంకర్’ ట్రైలర్‌లో రాజశేఖర్ డ్యాన్స్‌ని మెగాస్టార్ చిరంజీవి ఇమిటేట్ చేశారు.

Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..
Megastar Chiranjeevi In Bholaa Shankar

యాంగ్రీ‌మెన్ రాజశేఖర్ (Rajasekhar) డ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. రాజశేఖర్ ప్రస్తావన వచ్చిందంటే చాలు.. కచ్చితంగా ఆయన డ్యాన్స్‌ గురించి మాట్లాడకుండా ఉండరు. ఆయన వేసే డ్యాన్స్‌కు అభిమానులేమోగానీ.. ఇతర హీరోలని మాత్రం ఆ డ్యాన్స్ బాగా ఆకర్షిస్తోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) సినిమాలో ఈ డ్యాన్స్ కోసం ఓ సన్నివేశాన్నే సృష్టించారు. అందులో ఓ విలన్.. రాజశేఖర్ నటించిన ‘అల్లరి ప్రియుడు’ (Allari Priyudu) సినిమాలోని ‘రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా’ పాటకు సేమ్ టు సేమ్ ఆయన చేసినట్లుగానే డ్యాన్స్ చేస్తాడు. ఆ విలన్, ఆ తర్వాత ఎక్కడ కనిపించినా అదే డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోని ఆ సన్నివేశం.. సినిమా హైలెట్స్‌లో ఒకటిగా నిలిచింది.


‘గబ్బర్‌సింగ్’ సినిమా విడుదల తర్వాత.. అందులోని రాజశేఖర్ డ్యాన్స్ సీన్‌పై రకరకాలుగా చర్చలు నడిచాయి. ఎందుకంటే.. మెగా ఫ్యామిలీకి, రాజశేఖర్ ఫ్యామిలీకి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు జీవితా రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసిరి అల్లరి చేసినట్లుగా.. అప్పట్లో పెద్ద ఇష్యూనే జరిగింది. దీనికి చిరంజీవి స్వయంగా రాజశేఖర్ వాళ్ల ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పారు. అదే సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ (CCT)పై జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) కొన్ని ఆరోపణలు చేశారు. దీనిలో రాజకీయ కోణం దాగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇరు ఫ్యామిలీల మధ్య సన్నిహిత సంబంధాలే నడుస్తున్నాయి. అప్పటి జీవితా రాజశేఖర్ ఆరోపణలపై అల్లు అరవింద్ (Allu Aravind) కేసు పెట్టగా.. ఆ కేసులో తుది తీర్పు ఇటీవల వచ్చి.. జీవితా, రాజశేఖర్‌లకు జైలు శిక్ష కూడా విధించారు. సరే అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు రాజశేఖర్ డ్యాన్స్‌ని చిరంజీవి అనుకరించడం.. (Chiranjeevi Imitates Rajasekhar Dance) హాట్ టాపిక్ అవుతోంది.

Megastar.jpg

తాజాగా విడుదలైన ‘భోళా శంకర్’ (Bholaa Shankar) థియేట్రికల్ ట్రైలర్‌లో.. మెగాస్టార్ చిరంజీవి ఓ సన్నివేశంలో రాజశేఖర్‌లా డ్యాన్స్ (Rajasekhar Dance) చేస్తూ కనిపించారు. ఆ సన్నివేశం ఏమిటనేది సినిమా విడుదలయ్యే వరకు తెలియదు కానీ.. ట్రైలర్‌లో మాత్రం ఓ సెకను పాటు ఆ సన్నివేశాన్ని చూపించారు. దీంతో అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్నయ్య.. రాజశేఖర్‌ను భలే వాడేస్తున్నారుగా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ (Megastar) మరోసారి మాస్ అవతార్‌లో ఈ సినిమాలో విజృంభించబోతున్నారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

**************************************

*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

Updated Date - 2023-07-27T18:09:23+05:30 IST