Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

ABN , First Publish Date - 2023-07-26T18:18:33+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్ట్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది
Mega Star Chiranjeevi and Global Star Ram Charan

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. టీజర్‌ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించి విడుదలవుతోన్న ప్రతీది.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పుడీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్‌డేట్‌ను వదిలారు. (Bholaa Shankar Trailer Release Update)


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) గురువారం సాయంత్రం 4:05 గంటలకు ‘భోళా శంకర్’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఓ మాసివ్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిచ్చేశారు. ట్రైలర్‌ని రామ్ చరణ్ లాంచ్ చేయడం అనేది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోందనే విషయం తెలియంది కాదు. ట్రైలర్ కోసం ఇలా మెగాపవర్ స్టార్‌ని లైన్‌లోకి దింపడంతో.. వాట్టే టైమింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ (Mega Fans) సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌ వేరు.. రేపు రాబోయే ట్రైలర్ వేరు అన్నట్లుగా మేకర్స్ కూడా మెగా ఫ్యాన్స్‌కు మాంచి ఊపిస్తున్నారు. చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతుందో..

Megastar.jpg

తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ వంటి తారాగణం నటించిన ఈ చిత్రానికి.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

**************************************

Updated Date - 2023-07-26T18:19:50+05:30 IST