Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

ABN , First Publish Date - 2023-07-26T22:10:42+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా.. డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్ కావాలయ్యా’.. సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుండగా.. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట
Tamannaah in Jailer Movie

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కథానాయకుడిగా.. డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందనను రాబట్టుకోగా.. ‘జైలర్’ ఫస్ట్ సింగిల్ ‘నువ్ కావాలయ్యా’ (Nuv Kaavaalayya) పాట తమిళ్ వెర్షన్‌లో విడుదలై నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతూ.. అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ సాంగ్ తెలుగు వెర్షన్‌ని విడుదల చేశారు మేకర్స్.


అనిరుధ్‌ ఈ పాటని క్యాచీ బీట్స్‌తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్‌ కలసి హైలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఓ రేంజ్‌లో పాటని జనాల్లోకి తీసుకెళ్లిపోయాయి. తెలుగులోనూ ఈ పాట దుమ్మురేపుతూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Rajini.jpg

మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, రమ్య కృష్ణన్ వంటి ప్రముఖ తారాగణంతో పాటు.. వసంత్ రవి, నాగబాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది. విజయ్ కార్తిక్ కన్నన్ కెమరామెన్‌గా పనిచేస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా చేస్తున్నారు. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (Nuv Kaavaalayya Telugu Lyrical Video Song)


ఇవి కూడా చదవండి:

**************************************

*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

Updated Date - 2023-07-26T22:10:42+05:30 IST