Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

ABN , First Publish Date - 2023-07-27T22:06:13+05:30 IST

ఇలియానా ఓ బిడ్డకు జన్మనిచ్చే టైమ్ దగ్గరికి వచ్చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో చూసిన ఎవరైనా ఇదే విషయం చెబుతారు. ప్రస్తుతం ఆమె 9వ నెల గర్భవతి అన్నట్లుగా ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే అనిపిస్తోంది. ఈ ఫొటోలను చూసిన వారంతా.. త్వరలోనే ఆమె చేతిలో బేబీని చూడవచ్చనేలా కామెంట్స్ చేస్తున్నారు.

Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?
Ileana

ఇలియానా ఓ బిడ్డకు జన్మనిచ్చే టైమ్ దగ్గరికి వచ్చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో చూసిన ఎవరైనా ఇదే విషయం చెబుతారు. ప్రస్తుతం ఆమె 9వ నెల గర్భవతి అన్నట్లుగా ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే అనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లి కాకుండానే గర్భవతి అన్నట్లుగా ఆమెపై ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరంటూ.. ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశ్నిస్తున్నవారే. అందుకు ఆమె కూడా నెటిజన్లను ఆటపట్టిస్తూ.. కనిపించి కనిపించనట్లుగా, చెప్పి చెప్పనట్లుగా తన ప్రెగ్నెన్సీకి కారణమైన వాడి ఫొటోలను వదులుతుంది. ఇలా నిత్యం ఇలియానా వార్తలలో నిలుస్తూనే ఉంది.


అయితే 10 వారాల క్రితం అంటే సుమారు రెండు నెలల క్రితం తను ప్రెగ్నంట్ అంటూ పెట్టిన పోస్ట్‌లో ఉన్న ఇలియానాకి, తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌లో ఉన్న ఇలియానాకు చాలా తేడా కనిపిస్తుంది. కేవలం రెండు నెలలలో ఇలా ఎలా? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తే ఏం లాభం? అసలుదే క్లారిటీ లేనప్పుడు అనేలా.. కొందరు నెటిజన్లు వారిలో వారే సర్ది చెప్పుకుంటున్నారు. మొత్తానికైతే ఇలియానా తన ప్రెగ్నెన్సీతో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.

ఇప్పుడామె పెట్టిన ఫొటోలు చూస్తుంటే అతి త్వరలోనే ఇలియానా ఒడిలో బేబీని చూడొచ్చనేది అర్థమవుతోంది. ఆగస్ట్‌లో ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లుగా కూడా టాక్ వినబడుతోంది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత.. పుట్టిన బిడ్డని, అందుకు కారణమైన వాడిని ఒకేసారి పరిచయం చేస్తుందేమో చూడాలి. తెలుగులో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఇలియానా కోసం టాలీవుడ్ ద్వారాలు తెరిచే ఉంచారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

**************************************

*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

Updated Date - 2023-07-27T22:06:13+05:30 IST