Ram Charan: గ్లోబల్ స్టార్‌కి ‘ఆర్‌సీ 15’ టీమ్ సర్‌ప్రైజ్.. గులాబీల వర్షంతో..

ABN , First Publish Date - 2023-03-26T11:33:33+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా సక్సెస్ తర్వాత రామ్‌చరణ్ వరుస సినిమాలు కమిట్ అవుతున్న విషయం తెలిసిందే.

Ram Charan: గ్లోబల్ స్టార్‌కి ‘ఆర్‌సీ 15’ టీమ్ సర్‌ప్రైజ్.. గులాబీల వర్షంతో..
Ram Charan

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా సక్సెస్ తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) వరుస సినిమాలు కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ‘ఆర్‌సీ 15’ (RC 15) పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా.. సోమవారం (మార్చి 27న) రామ్‌చరణ్ పుట్టిన రోజు. అయితే.. రెండు రోజుల ముందుగానే ఆయన బర్త్‌ డే వేడుకలు మొదలయ్యాయి. ఆర్‌సీ 15 టీం రామ్‌చరణ్ బర్త్ డే వేడుకలనను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో.. చెర్రీ సెట్లోకి ఎంట్రీకాగానే.. ఆయనపై గులాబీల వర్షం కురిపించారు. అది చూసి చెర్రీ చాలా ఆనందపడ్డాడు. అనంతరం దర్శకుడు శంకర్‌తో కలిసి చెర్రీ కేక్‌కట్‌ చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌లో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు, హీరోయిన్ కియారా, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ వీడియోతో పాటు ఈ టీం ఎంతో సరదాగా గడిపిన పలు ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చెర్రీ క్రేజ్ మామూలుగా లేదుగా అని పలువురు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

RC1.jpg

అయితే.. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఆ మూవీకి వివిధ విభాగాల్లో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించాయి. అలాగే.. ఆ మూవీతో చెర్రీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో త్వరలోనే ఆయన ఓ హాలీవుడ్ మూవీలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై నిన్నటి ఏడాది పూర్తయింది. దీంతో ‘#1YearOfHistoricalRRR’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Updated Date - 2023-03-26T11:54:35+05:30 IST