Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..

ABN , First Publish Date - 2023-03-17T11:43:06+05:30 IST

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati).

Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..
RRR

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). ఓ వైపు వరుసగా తెలుగు సినిమాలు చేస్తూనే.. ఇతర ఇండస్ట్రీల్లోనూ పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నటుడు ఇటీవలే ‘రానా నాయుడు’ (Rana Naidu)తో ఓటీటీకి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఇది అమెరికన్ వెబ్‌సిరీస్ ‘రే డోనోవన్’ (Ray Donovan) ఆధారంగా తెరెక్కింది. ఇందులో బాబాయ్ వెంకటేశ్‌ (Venkatesh)‌తో కలిసి నటించాడు. వెంకటేశ్ తండ్రి పాత్ర చేయగా.. రానా కొడుకు పాత్ర చేశాడు.

మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. మొదటి రోజు నుంచే ఎక్కువగా అసభ్య సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మిలియన్ల వ్యూస్‌ ట్రెండ్ అవుతోంద. కాగా.. ఈ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ నుంచి తనకి దొంగతనం చేయాలనుకుంటున్న విషయం గురించి చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్ (Ram Charan) ఇతరులకి సాయం చేసే గుణం కావాలని చెప్పాడు. ప్రభాస్ (Prabhas) నుంచి అతని చెఫ్‌, అతని ఫుడ్‌ని తీసుకోవాలనుకుంటున్నా అని తెలిపాడు. ఎన్టీఆర్ (NTR) గురించి రానా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ నుంచి భాష నేర్చుకునే నైపుణ్యాన్ని దొంగతనం చేయాలనుకుంటున్నా. అతను ఏ లాంగ్వేజ్‌నైనా చాలా సులభంగా నేర్చుకుంటాడు. చైనీస్ భాషని సైతం 20 నిమిషాల్లో నేర్చుకుని మాట్లాడే టాలెంట్ తారక్‌కి ఉంది. ఆయనికి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ వంటి పలు భాషలు వచ్చు’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-17T11:54:54+05:30 IST