Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-03-17T09:00:11+05:30 IST

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో అది మరి ఎక్కువైంది..

Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Kabzaa

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో అది మరి ఎక్కువైంది. ఆ ట్రెండ్‌‌లో కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) కూడా చేరిపోయారు. ఆయన నటించిన తాజా పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కబ్జ’ (Kabzaa) పాన్ ఇండియా మూవీగా నేడు (మార్చి 17న) విడుదలైంది. ఆర్ చంద్రు వ్రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar), కిచ్చా సుదీప (Kiccha Sudeepa), శ్రియా శరణ్ (Shriya Saran) కీలక పాత్రల్లో నటించారు.

అయితే.. ఇంతకుముందే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’ రాబోతుందంటూ పలువురు కామెంట్స్ కూడా చేశారు. స్వాతంత్ర్యానికి ముందు సాగే కథ ‘కబ్జ’. అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్‌‌‌తో యుద్ధానికి దిగే అరకేశ్వర అనే ఎయిర్‌ఫోర్స్ సైనికుడి కథే ఈ చిత్రం. నేడు విడుదలైన ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఇప్పటికే పలు చోట్ల పడిపోయాయి. దీంతో ఈ మూవీ ఎలా ఉందో చెబుతూ పలువురు ట్విట్టర్‌లో పోస్టులు షేర్ చేస్తున్నారు.

‘కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న మరో ఎల్డోరాడో కబ్జ. ఉపేంద్ర నటన సూపర్. కిచ్చా సుదీప, శివన్న క్యామియోలు చూస్తే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి’.. ‘కన్నడ సినిమాలని కబ్జ మరోసారి గర్వపడేలా చేస్తుంది. నెగెటివ్ కామెంట్స్‌ని నమ్మకండి. సినిమా బావుంది’ అని కొందరూ రాసుకొస్తుండగా.. మరికొందరేమో ‘కేజీఎఫ్‌ని చూసినట్లే ఉంది.. ఏం కొత్తదనం లేదు’ అంటూ నెగెటివ్‌గా రాసుకొస్తున్నారు. కాగా.. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

Updated Date - 2023-03-17T09:06:59+05:30 IST