Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!

ABN , First Publish Date - 2023-06-07T13:30:44+05:30 IST

మంగళవారం జరిగిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ అందరూ ప్రభాస్‌ని ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన సమాధానం మరింత కన్ఫ్యూజ్ చేస్తోంది. ‘ఇక్కడే తిరుపతిలోనే.. ఎప్పుడైనా చేసుకుంటా’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఇచ్చిన ఈ సమాధానంపై ఇప్పుడంతా చర్చలు మొదలెట్టారు.

Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!
Prabhas at Adipurush Pre Release Event

‘ఇక్కడే తిరుపతిలోనే.. ఎప్పుడైనా చేసుకుంటా..’ ఇది పెళ్లి గురించి ఫ్యాన్స్ అడిగిన దానికి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇచ్చిన సమాధానం. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ఫ్యాన్స్ అడిగారు. దానికి ఎవరైనా ఏం సమాధానం చెబుతారు.. ‘తొందరలోనే పెళ్లి చేసుకుంటాను’.. లేదంటే ‘చెబుతాను ఆ విషయం ఇప్పుడు కాదు’ అనో చెప్పేసి ఉండాల్సింది. నిజంగా చేసుకునే ఉద్దేశ్యం ఉంటే.. ఇంకో రెండు మూడు నెలలో, నాలుగైదు నెలలోనే అని చెప్పేస్తే బాగుండేది. అలా కాకుండా ‘ఎప్పుడైనా’ అంటే ఏమిటి? అర్థం. చేసుకుంటాను అనా? లేక చూద్దాంలే అనా? ఏమీ అర్థం కాకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేశాడు ప్రభాస్. ‘ప్రభాస్ ఏం చెప్పాడ్రా?’ అంటూ ఇప్పుడిదే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది. మొత్తంగా అయితే మరోసారి పెళ్లిపై ప్రభాస్ మాట దాట వేశాడనేది ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది. (Prabhas about His Marriage)

Prabhas-pic.jpg

ఇక ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా గురించి ప్రభాస్ (Prabhas) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ చూసి, మీరిచ్చిన ధైర్యంతోనే టీమ్‌ మొత్తం ఇప్పటికీ నడుస్తోంది. చిరంజీవి (Chiranjeevi)గారు ఓ సందర్భంలో నన్ను ‘రామాయణం’ (Ramayan)పై సినిమా చేస్తున్నావట కదా.. అని అడిగారు. అవును సార్ అని చెప్పాను. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అంటూ ఆశీర్వదించారు. నిజంగానే ఆయన చెప్పినట్లుగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం మేం అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఓం రౌత్‌ (Om Raut), టెక్నీషియన్లు 8 నెలలు యుద్ధం చేశారు. రోజుకు వారు రెండు మూడు గంటలే నిద్రపోతున్నారు. అంతలా కష్టపడుతున్నారు. (Prabhas about Adipurush)

Prabhas.jpg

సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రామాయణంలో లాగా చాలా కష్టాలు పడ్డాం. భూషణ్‌ చాలా ఎమోషనల్‌గా తీసుకున్నారు. మంచి అమ్మాయి కృతి సనన్‌ (Kriti Sanon) మన జానకి. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో సీతమ్మ పాత్రకు తను సరైన ఎంపిక అని నిరూపించుకున్నారు. దేవ్‌తో నటిస్తున్నప్పుడు ఆయన నిజంగానే హనుమంతుడులా అనిపించారు. అజయ్‌, అతుల్‌ (Ajay Atul) అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఓం రౌత్‌ నా హీరో. అభిమానులే నా బలం. ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. మూడు కూడా రావొచ్చు. సాదారణంగా నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఇకపై స్టేజీ మీద తక్కువ మాట్లాడి.. ఎక్కువ సినిమాలు చేస్తాను..’’ అని ప్రభాస్ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్‌ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం

*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..

*Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్‌.. ఇప్పుడిదే హాట్ టాపిక్

*Adipurush: గందరగోళం‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం

*#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!

Updated Date - 2023-06-07T13:33:26+05:30 IST