Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్‌ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం

ABN , First Publish Date - 2023-06-07T12:09:13+05:30 IST

తిరుపతిలో మంగళవారం జరిగిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చిత్ర బృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్‌ను హగ్ చేసుకుని, కిస్ చేశారు. ఇప్పుడిది పెద్ద వివాదంగా మారింది. భక్తులు ఈ చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్‌ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం
Kriti Sanon and Om Raut

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతి (Tirupati)లో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) అనంతరం బుధవారం చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ.. దర్శనం అనంతరం గుడి నుంచి బయటికి వచ్చిన దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌ను హగ్ చేసుకుని కిస్ చేయడంతో.. ఇప్పుడిదో పెద్ద వివాదంగా మారింది. భక్తులు, బిజెపి నాయకులు ఓం రౌత్ (Om Raut), కృతిసనన్‌ (Kriti Sanon)ల ముద్దులు, హగ్గుల తీరును తప్పుబడుతూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలియుగ దైవం, భక్తులు ఎంత పరమ పవిత్రంగా భావించే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఇటువంటి చిల్లర పనులు ఏంటంటూ భక్తులు మండిపడుతున్నారు. ఎంత బాలీవుడ్ కల్చర్ అయితే మాత్రం.. ఎక్కడున్నామనేది గమనించరా? హిందూ దేవాలయాలంటే అంత చీప్ అయిపోయాయా? దేవునిపై సినిమా తీయడం గొప్ప కాదు. ఆ దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం గొప్ప. అసలు వారిది భక్తి కాదు.. భక్తిని అమ్ముకోవడమే వారి పని.. అంటూ భక్తులు చిత్రయూనిట్‌పై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. (Om Raut Kissed Kriti Sanon at Tirumala Temple)

Om-Raut.jpg

‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకను అంత గొప్పగా నిర్వహించి.. ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామిని సైతం వేడుకకు రప్పించి.. దైవత్వం ఉట్టిపడేలా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్న టీమ్.. ఆ గౌరవాన్ని కాసేపు కూడా కాపాడుకోలేకపోయింది. అసలు శ్రీవారి సన్నిధిలో ఇంత సాహసానికి ఎలా పూనుకున్నారు? అంటూ భక్తులు యూనిట్‌ను తిట్టిపోస్తుంటే.. ముద్దులు, హగ్గులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు అంగీకారం కాదని బిజిపి నేత (Bjp Leader) రమేష్ నాయుడు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీవారి గుడి ముందు ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గు, ముద్దుల వీడియోపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ వివాదంపై ఆదిపురుష్ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..

*Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్‌.. ఇప్పుడిదే హాట్ టాపిక్

*Adipurush: గందరగోళం‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం

*#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!

*BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్

*Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

Updated Date - 2023-06-07T12:09:13+05:30 IST