Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్‌.. ఇప్పుడిదే హాట్ టాపిక్

ABN , First Publish Date - 2023-06-06T21:23:48+05:30 IST

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా విభిన్న పాత్రలతో దూసుకెళుతోన్న నటుడు ఎస్.జె. సూర్య హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా.. రాధామోహన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బొమ్మై’. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు కలిసి చేస్తున్న డీప్ లిప్‌లాక్‌ సన్నివేశం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.

Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్‌.. ఇప్పుడిదే హాట్ టాపిక్
Lip Lock Scene in Bommai Movie

సూర్య లిప్‌లాక్ అనగానే అంతా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అని అనుకుంటారు. కానీ ఇక్కడ సూర్య ఆయన కాదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ‘ఖుషి’ సినిమా డైరెక్ట్ చేసిన ఎస్.జె. సూర్య (SJ Suryah). ఆయనిప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బొమ్మై’ (Bommai). ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) నటించింది. అయితే వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రంలోని లిప్‌లాక్‌ సన్నివేశం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.

కుటుంబ కథా చిత్రాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించే ప్రియ భవానీ.. ఇందులో మాత్రం లిప్‌లాక్‌ సీన్లలో నటించడం ఆమె అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాధామోహన్‌ (Radhamohan) దర్శకత్వంలో ఎస్‌స్. జె. సూర్య, ప్రియభవానీ, చాందినీ తమిళరసన్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం సమకూర్చిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. (Bommai Official Trailer Out)

Suryah.jpg

‘బొమ్మలపై అమితమైన ఇష్టంతో ఉండే హీరో.. ఆ బొమ్మలకు ఏమైనా జరిగితే తట్టుకోలేనన్న ఊహాజనిత లోకంలో జీవిస్తుంటాడు. అలా ఒకానొక సందర్భంలో తన హద్దు దాటిపోతాడు. తద్వారా జరిగే విపరీత పరిణామాలు ఏంటన్నదే ఈ చిత్ర కథ. ఈ ట్రైలర్‌లో ప్రియ భవానీ శంకర్‌ లిప్‌లాక్‌ సన్నివేశాన్ని పొందు పరిచారు. దీంతో ఇది ఒక్కసారిగా వైరల్‌ అయింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఎట్టకేలకు జూన్ 16న ఈ చిత్రానికి మోక్షం లభించనుంది. ‘మాన్‌స్టర్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత ఎస్‌.జె. సూర్య, ప్రియా భవానీ శంకర్‌ మరోసారి ఇందులో జంటగా నటించారు. ఎస్‌. చంద్రప్రకాష్‌ జైన్‌ ఆశీస్సులతో ఎస్‌.జె. సూర్య సమర్పణలో ఏంజెల్‌ స్టూడియోస్‌, ఎంహెచ్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానరుపై నిర్మాతలు డాక్టర్‌ వి.మరుదు పాండ్యన్‌, డాక్టర్‌ జాస్మిన్‌ సంతోష్‌, డాక్టర్‌ దీపా టి.దురై నిర్మించారు. (Liplock in Bommai Trailer)


ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: గందరగోళం‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం

*#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!

*BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్

*Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

*NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

Updated Date - 2023-06-06T21:23:48+05:30 IST