#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!

ABN , First Publish Date - 2023-06-06T19:39:20+05:30 IST

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ ‘#మెన్‌టూ’ చిత్రం మే 26న థియేటర్లలో విడుదల కాగా, రెండు వారాలలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది.

#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!
MenToo Movie Still

ఓటీటీల హవా ఎంతగా పెరిగిపోతుందంటే.. పెద్ద సినిమాలు అయితే 4 వారాలు.. చిన్న సినిమాలు అయితే 2 వారాల్లోనే ఓటీటీలలో సందడి చేసేంతగా. కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అయ్యేంతగా.. అంతగా ఓటీటీ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడొక సినిమా థియేటర్స్‌లో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ ‘#మెన్‌టూ’ (#MenToo) చిత్రం జూన్ 9న ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. (#MenToo OTT Release Date)

ఈ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న లోక‌ల్ ఓటీటీ ‘ఆహా’‌ (Aha)లో జూన్ 9 శుక్రవారం స్ట్రీమింగ్ కానుందని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ప్ర‌తి శుక్ర‌వారం ఓ కొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆడియెన్స్‌కి అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే శుక్రవారం (జూన్ 9) ‘#మెన్‌టూ’తో వినోదాన్ని పంచనుంది. ‘#మెన్‌టూ’ విషయానికి వస్తే.. ఈ సినిమా మే 26న థియేటర్లలో విడుదలై.. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో..

Brahmaji.jpg

సాధార‌ణంగా భార్య‌ల‌ను భ‌ర్త‌లు చిత్ర హింస‌లు పెట్ట‌టం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. అయితే పెళ్లి కానీ మ‌గ‌వాళ్లు ప్రేయ‌సిల చేతిలో.. పెళ్లైన వారు భార్య‌ల చేతిలో తెలియ‌ని బాధ‌ను అనుభ‌విస్తుంటార‌నే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి (Srikanth G Reddy) ఈ ‘#మెన్ టూ’ సినిమాను రూపొందించారు. అలాగ‌ని ఈ చిత్రం ఏమైనా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉంటుందా? అంటే.. అలాంటిదేమీ లేదని, ఫ్యామిలీ మొత్తం స‌ర‌దాగా న‌వ్వుకుంటూ చూసేలా ఉంటుంద‌ని మేక‌ర్స్‌ తెలుపుతున్నారు. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం (Maurya Siddhavaram) ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్

*Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

*NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

*Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

*Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

Updated Date - 2023-06-06T19:39:20+05:30 IST