Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..

ABN , First Publish Date - 2023-06-07T01:11:11+05:30 IST

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 16న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు.

Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..
Adipurush Pre Release Event

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 16న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తిరుపతికి ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆధ్యాత్మిక గురు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఎవరేం మాట్లాడారంటే.. (Adipurush Pre Release Event)

హనుమాన్ పాత్రధారి దేవదత్త నాగే మాట్లాడుతూ… శతాబ్దాల క్రితం ప్రభు శ్రీరాముడి రాజ్యం ఉండేది. చాలా ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం అవుతోంది. సరిగ్గా ఇదే మళ్ళీ రామరాజ్యం. ఒక్కడే సూర్యుడు. ఒక్కడే చంద్రుడు. ఒక్కడే డార్లింగ్. అతనే ప్రభాస్. మనం దుఃఖాన్ని చూసినప్పుడల్లా, సూర్యుని కిరణం, ఆశ యొక్క కిరణం కోసం ఆశిస్తాము. మన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. అతనే రాముడి అవతారంలో ఉన్న ప్రభాస్. కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. జై శ్రీ రామ్ అని జపిస్తూ ప్రపంచానికి గొప్ప సినిమాను అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆయనే ఓం రౌత్. ఇక్కడ మన కృతి, మన భూదేవి కూతురు ప్రకృతి. స్నేహితులు మరియు కుటుంబం, ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు. ప్రభాస్ అభిమానుల ప్రేమ అద్బుతం. మళ్లీ జూన్ 16న రామోత్సవ్‌ను జరుపుకుందామని అన్నారు.

సంగీత దర్శకులు అజయ్-అతుల్ మాట్లాడుతూ.. ఈరోజు మాతో పాటు చాలా మంది ప్రేక్షకులను చూడటం చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా పాటల కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. పాటలను ఇంతగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని పాటలు నేడు విడుదల కానున్నాయి. మీరు ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. తెలుగులో మాకిదే మొదటి సినిమా. మేము హిందీ మరియు మరాఠీలో కాకుండా ఏ భాషలోనైనా పాడాము అంటే అది తెలుగే. కాబట్టి ఏవైనా తప్పులుంటే క్షమించండి అని కోరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న జీయర్ స్వామి వారికి నా పాదాభివందనాలు. చిత్ర బృందానికి, అభిమానులకి కూడా నా నమస్కారం. ఆదిపురుష్ సినిమా రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలని తీసుకుని నిర్మించడం జరిగింది. మన భారత దేశ ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి. బాహుబలి తర్వాత తెలుగులో కూడా అదే స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్న ప్రభాస్ సినిమా ఇది. మన భారతదేశ చరిత్రలో గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీని వాడి ప్రస్తుతం ఉన్న యువత కళ్లకు కట్టే విధంగా ఈ సినిమాని నిర్మించారు. సినిమాకి పని చేసిన అందరిని అభినందిస్తూ రామాయణం ఆధారంగా విడుదలవుతున్న ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

లక్ష్మణ పాత్రధారి సన్నీ సింగ్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు అన్నయ్య. అతను ఒక డార్లింగ్. కృతి మరియు దేవదత్త అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు పని చేయడం గొప్ప అనుభవం. ప్రభాస్ గారు తెరపైనా, బయటా పెద్ద అన్నయ్య. ఇలాంటి పాత్ర లభించడం ఓ వరం. ప్రదర్శన చేస్తున్నప్పుడు నాకు గూస్‌బంప్స్ వచ్చేవి. ఈ చారిత్రాత్మక పురాణ చిత్రంలో భాగం కావడం నాకొక ఎమోషనల్ జర్నీ అని అన్నారు.

Adipurush-1.jpg

పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఆదిపురుష్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది జరిగినందుకు ప్రభాస్‌గారికి ధన్యవాదాలు. టి సిరీస్, రెట్రోఫిల్స్ మరియు యువి క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని తెలిపారు.

టీ సిరీస్ అధినేత భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘జై శ్రీరామ్‌.. ఓం రౌత్‌ వల్ల రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్‌ కుమార్‌ కల నెరవేరింది. ప్రభాస్‌కు కృతజ్ఞతలు. సినిమాకు దృశ్యరూపం అందించిన తీరు అద్భుతం. మా అమ్మ ఈ రోజు నాతో ఉంది మరియు ఆమె లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. ఆదిపురుష్ కేవలం సినిమా కాదు. ఇది ఒక ఎమోషన్. నాకు మాటలు రావట్లేదు మాట్లాడటానికి. మరోసారి ఓం కి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.

Prabhas.jpg

దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. జై శ్రీ రామ్! ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం ఆదిపురుష్ చివరి ట్రైలర్‌ని చూస్తున్నాము. మళ్లీ నేరుగా సినిమా హాళ్లలో కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భూషణ్ జీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పిన మాటలతో నన్ను ఎమోషనల్‌గా మార్చారు. ఈ రోజు అతను ఎలా భావిస్తున్నాడో నాకు తెలుసు మరియు నేను కూడా అలాగే భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని పెద్ద కాన్వాస్‌పైకి తీసుకొచ్చినందుకు అంతా చేసినందుకు ధన్యవాదాలు. ప్రభాస్ లేకుండా నేను దీన్ని చేయలేను. అతను నా డార్లింగ్. ఇది అందరి సినిమా అని చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ఇండియన్ సినిమా. అందరి ప్రేమకు ధన్యవాదాలు. జూన్ 16న సినిమా థియేటర్స్‌లో కలుద్దామని తెలిపారు.

Prabhas-1.jpg


తన స్పీచ్‌ని శ్రీరామ పద్యంతో మొదలుపెట్టిన చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ… జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్…డియర్ భగవత్ బంధువులారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం ఏమిటి అంటే.. బాహుబలి .. నిజమైన బాహుబలి రాముడు అని లోకానికి నిరూపించడానికే. ఈ వేళ ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు.. ప్రతి గుండెలోన రాముడు ఉన్నారు.. ఆ గుండెల్లో ఉండే రామున్ని అందరిలోంచి బయటకు తీసుకురావడానికి శ్రీమాన్ ప్రభాస్ తనలోంచి రాముడిని బయటకు తీసుకొస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మానవజాతికి సరైన దారి చూపించాల్సింది శ్రీరామచంద్రుడే. రామచంద్రుని గురించి రకరకాలుగా మాటలు ఏమి చెప్పినా.. రాముడు ఈ మట్టి మీద నడిచి పావనం చేసినటువంటి మహా పురుషుడు. మానవజాతికి ఆదర్శవంతమైన పురుషుడు ఆయన. చాలామంది రాముడిని దేవుడిగా కొలిచే వాళ్ళు ఉన్నారు. కొలవవచ్చు.. కానీ రామాయణంలో దేవతలంతా వచ్చి రామా నువ్వు సాక్షాత్తు నారాయణవయ్యా.. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ అయ్యా అని చెబితే .. రాముడు మాత్రం నేను మానవుడిని నన్ను మనిషిలాగే చూడాలి అని అనుకుంటున్నా. ఎందుకని అంటే రాముడు దేవుడు అని అనగానే ఆ దేవుడికి ఏంది ఏమైనా చేస్తారు అని మానవులు తప్పించుకునే ప్రమాదం ఉంది. ఒక మనిషి ఒక మార్గాన్ని నడిచి ఆదర్శాన్ని స్థాపించారు అంటే ఏ మనిషి అయినా సరే అలా ప్రవర్తించ తగును అని నిరూపించడానికి రాముడు మానవుడు అయ్యారు. రామాయణంలో రామచంద్రుడు మంచి మనిషి.. ఆయన పుట్టకముందే విష్ణువు అవతారం.. సాధించిన తర్వాత విష్ణువు. కానీ జీవన సమయంలో తాను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనము దేవతల వెంట పరుగులు పెట్టే అవసరం లేదు. దేవతలు మంచి మనిషి వెనక నడుస్తారు.. ఆ మంచి మనిషిని ఈ సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది. ఇది రామాయణం జాతికి నిరూపించింది కానీ మంచి మనిషి ఎట్లా ఉంటారు.. రాముడు అంటే మంచికి మారుపేరు అని మనిషి మనిషిగా ఉంటే అతనికి శత్రువులే ఉండరు అని రాముడు రుజువు చేశారు. రామునిని మనుషులు ప్రేమించారు.. ఋషులు ప్రేమించారు.. దేవతలు ప్రేమించారు.. పశువులు ప్రేమించాయి పక్షులు ప్రేమించాయి.. ముక్కు చెవులు కోసిన శూర్పనఖ కూడా రామచంద్రుని గురించి తిట్టాలని నోరు తెరిచి ఆఖరికి ఆయన కీర్తించింది. రాముడు అడవికి వెళుతూ ఉంటే రాముడిని చూస్తూ ఉండిపోయాయి గుర్రాలు కూడా. ఆ గుర్రాలని ఆ ప్రదేశం యొక్క మంచి బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. రాముడిని ఇలా పశువులు చెట్లు అన్ని ప్రేమించాయి. అందుకే ఈవేళ ఆయన్ని గుడులు కట్టి ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆ రాముడు మన అందరిలో ఉన్నారు కానీ ఎవరైనా మనలోంచి ఆ రాముడుని బయటకి తెచ్చేవాళ్ళు కావాలి. ఆ రాముని తమలో ఉండేటువంటి రాముడిని బయటకు తెస్తున్నారు హీరో ప్రభాస్. రామాయణంలో అరణ్యకాండ మరియు యుద్ధ కాండలో ఉండే ప్రధానమైనటువంటి వాటిని చరిత్రతో లోకానికి అందజేస్తున్నారు.. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరేది ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నారు. అలానే ఇలాంటి సినిమా ఇస్తున్న ఓం రౌత్ కి మా ధన్యవాదాలు. ఆదిపురుష్‌తో చరిత్ర సృష్టించినందుకు ఓం రౌత్ బృందానికి ఆశీస్సులు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. మనం మొబైల్ దేవాలయాలు. ఒక్కోసారి దేవుడు మన నుండి బయటకు వస్తాడు. రాముడు ప్రభాస్ నుండి వస్తున్నాడు... టీమ్ మొత్తానికి రాముడు ఆశీర్వదించాడు. ఇక్కడే రామాయణ చరిత్ర వెల్లడైంది. రాముడు మనందరికీ నిజమైన ఆదర్శం. రాముడిపై చాలా సినిమాలు వచ్చాయి. ఈ తరానికి మరొకటి కావాలి.. అదే ఆదిపురుష్ మరియు అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచానికి అందుబాటులోకి వస్తోందని తెలిపారు.

Updated Date - 2023-06-07T01:26:11+05:30 IST