BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-06-06T18:25:57+05:30 IST

టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఇప్పుడు ఎంత బిజీ హీరోయిన్నో తెలియంది కాదు. ఏ సినిమాని కదిలించినా.. అందులో శ్రీలీల పేరు లేకుండా ఉండటం లేదు. ప్రస్తుతం ఆమె రామ్, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న బోయపాటిరాపో చిత్ర చివరి షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు రామ్‌తో కలిసి మైసూర్‌లో అడుగుపెట్టింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్
Sreeleela and Ram

టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ఇప్పుడు ఎంత బిజీ హీరోయిన్నో తెలియంది కాదు. ఏ సినిమాని కదిలించినా.. అందులో శ్రీలీల పేరు లేకుండా ఉండటం లేదు. శ్రీలీల ఎలా.. ఇన్ని సినిమాలకు డేట్స్ ఎడ్జస్ట్ చేస్తుందో తెలియడం లేదు కానీ.. తాజాగా ఆమె బోయపాటిరాపో (BoyapatiRAPO) సినిమా సెట్స్‌లో అడుగు పెట్టినట్లుగా కొన్ని ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #BoyapatiRAPO షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రబృందం మంగళవారం మైసూర్‌ (Mysore)‌లో చివరి షెడ్యూల్‌‌ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌‌లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు.

Ram-and-Sreeleela.jpg

మైసూర్‌‌లో జరిగే ఈ షెడ్యూల్‌‌తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్ (Ram), శ్రీలీల (Sreeleela) కాండీడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీల బ్లాక్, రామ్ వైట్ డ్రస్‌లలో.. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌‌లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. కాగా.. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ (First Thunder).. రామ్‌ని రగ్డ్ లుక్‌‌తో మాస్ క్యారెక్టర్‌‌లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్‌కు అద్భుతమైన స్పందన రావడమే కాకుండా.. సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకునేలా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. (BoyapatiRAPO Update)

Ram-and-Sreeleela-2.jpg

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్లుగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) చెబుతున్నారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Ram-Pic.jpg

ఇవి కూడా చదవండి:

************************************************

*Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

*NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

*Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

*Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

*Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..

*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

Updated Date - 2023-06-06T18:29:21+05:30 IST