Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2023-07-25T18:38:18+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఫాంటసీ చిత్రం ‘భైరవద్వీపం’. ఈ చిత్రం.. తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతంగా ఇప్పటికీ కీర్తింపబడుతోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కి 14 ఏప్రిల్ 1994న విడుదలైన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు 4K వెర్షన్‌లో విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది.

Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్
Bhairava Dweepam Movie Still

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఫాంటసీ చిత్రం ‘భైరవద్వీపం’ (Bhairava Dweepam). ఈ చిత్రం.. తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతంగా ఇప్పటికీ కీర్తింపబడుతోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన తీరు.. నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ‘భైరవద్వీపం’ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పుడీ ఎవర్‌గ్రీన్ క్లాసిస్ చిత్రాన్ని క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ (Claps infotainment) వారు.. ఈ తరం ప్రేక్షకుల కోసం 5 ఆగస్ట్, 2023న అప్‌గ్రేడ్ చేసిన 4K (Bhairava Dweepam4K) క్వాలిటీతో రీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ప్రయత్నం అయితే బాగానే ఉంది కానీ.. ప్లానింగ్ కరెక్ట్‌గా లేదంటే కొందరు ఫ్యాన్స్.. ఈ రీ రిలీజ్‌పై కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అసలే వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దవుతున్నాయి. ఈ సమయంలో కాకుండా.. మంచి టైమ్ చూసుకుని వదిలితే.. ఖచ్చితంగా బ్రేకిస్తాం అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అందులోనూ ఆగస్ట్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌లున్నాయి. థియేటర్లు దొరకడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో కాకుండా.. కాస్త జనాలంతా థియేటర్లకి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలిస్తున్నారు. కానీ క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ వారు మాత్రం ఆగస్ట్ 5న రిలీజ్ చేసేందుకు అన్నీ రెడీ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. (Bhairava Dweepam Re Release)

Balakrishna.jpg

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్‌‌గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి పద్మావతి (రోజా)తో ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు పద్మావతిని బలి ఇవ్వడానికి ‘భైరవద్వీపం’ అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది.. గొప్ప మలుపులతో, అద్భుతమైన దృశ్యాలతో కూడిన విజువల్ వండరే ఈ ‘భైరవ ద్వీపం’. రావి కొండలరావు (Raavi Kondala Rao) రాసిన ఈ మ్యాజికల్ స్టోరీకి.. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావే స్వయంగా స్క్రీన్‌‌ప్లే రాశారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మాణ విలువలు ప్రతి జనరేషన్‌ని ఆకట్టుకునేలా అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఈ చిత్రం భారీ బాక్సాఫీస్ నంబర్లు, ప్రేక్షకుల ఆదరణతో పాటు 9 నంది అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడీ సినిమాని సరికొత్తగా చంద్ర శేఖర్ కుమారస్వామి (Chandra Sekar Kumaraswamy), క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ పి.దేవ్ వర్మ (P Dev Varma) ప్రేక్షకులకు అందించబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bro: ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే వారంతా.. ఈ విషయం తెలుసుకోండి

**************************************

*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

**************************************

*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

Updated Date - 2023-07-25T18:38:18+05:30 IST