Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

ABN , First Publish Date - 2023-07-26T15:24:34+05:30 IST

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సముద్రఖని చిత్ర విశేషాలను తెలియజేశారు.

Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..
Bro Director Samuthirakani

‘‘స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అని పవర్ స్టార్ అడిగారు. రేపటి నుంచే సార్ అని అనగానే ఆయనొక చిరునవ్వు నవ్వారు.. దానిని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని అన్నారు ‘బ్రో’ చిత్ర దర్శకుడు సముద్రఖని (Samuthirakani). ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘బ్రో’ (Bro). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను (Bro Pre Release Event) గ్రాండ్‌గా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ.. ‘‘ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి, చెన్నై వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ‘బ్రో’ సినిమా చేశాను. నాకు టైం వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. నేనేది ప్లాన్ చేయలేదు, అదే జరిగింది. మన పని మనం చేస్తుంటే మన టైం వస్తుంది. నేను ఒకసారి త్రివిక్రమ్ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన సినిమా విడుదలై పది రోజులు అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన (పెద్ద డాన్) ఆ సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పాను. అన్నయ్య ఆ సినిమా కథ చెప్పమంటే ఒక పది నిమిషాల్లో చెప్పాను. ఆయనకు కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ అన్నయ్య రూపంలో నేను టైంని చూశాను. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. (Samuthirakani Speech at Bro Event)

Bro-Movie.jpg

అప్పటినుంచి ఏడాదిన్నర ఈ సినిమా పని మీదే ఉన్నాను. ఎప్పుడూ ఒక్క శాతం కూడా నమ్మకం కోల్పోలేదు. టైం కోసం ఎదురుచూశాను. టైం వచ్చింది. టైం(పవన్ కళ్యాణ్)ని కలిశాను. ఆయనను కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయనొక చిరునవ్వు నవ్వారు. దానిని మర్చిపోలేను. 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను. అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. పవన్ కళ్యాణ్‌గారితో కలిసి పనిచేయడం అదృష్టం. సోదరుడు తేజ్‌తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు’’ అని అన్నారు. (Bro Director Samuthirakani)


ఇవి కూడా చదవండి:

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

*Bro: ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే వారంతా.. ఈ విషయం తెలుసుకోండి

**************************************

*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

**************************************

*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

Updated Date - 2023-07-26T15:24:34+05:30 IST