Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..

ABN , First Publish Date - 2023-09-20T21:52:06+05:30 IST

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయం స్వయంగా మంచు విష్ణునే తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం కారణంగా ఆమె ఈ సినిమా నుంచి వైదొలగినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..
Kannappa Movie Opening Pic

హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon) తప్పుకుంది. ఈ విషయం స్వయంగా మంచు విష్ణునే తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే.. ఇలా హీరోయిన్ తప్పుకోవడం ఏమిటా? అని అంతా అనుకుంటున్నప్పటికీ.. అందుకు కారణం కూడా మంచు విష్ణునే తెలపడం విశేషం.

‘‘కన్నప్ప చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు చేసే విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ నుపుర్‌ సనన్‌ తప్పుకుందని తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. ఆమెను ఎంతో మిస్ అవుతున్నాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో చేయబోయే నూతన నటీమణి కోసం సెర్చింగ్ మొదలెట్టాం. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. నుపుర్‌ సనన్ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం భవిష్యత్‌లో ఉంటుందని ఆశిస్తున్నాను. ఆసక్తికరమైన రోజులు రాబోతున్నాయి.. అప్‌డేట్స్‌ కోసం రెడీగా ఉండండి’’ అని మంచు విష్ణు తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. (Manchu Vishnu Tweet)


Kannappa.jpg

‘కన్నప్ప’ ప్రాజెక్ట్ కోసం మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ ఎటువంటి కేర్ తీసుకుంటుందో తెలియంది కాదు. రీసెంట్‌గానే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించబోతున్నట్లుగానూ, అందులోనూ శివుడి పాత్రలో.. అనేలా వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. కానీ ఇప్పుడు సడెన్‌గా హీరోయిన్ తప్పుకోవడంతో మరోసారి ఈ ప్రాజెక్ట్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అప్‌డేట్స్ అని మంచు విష్ణు చెబుతున్నారు కాబట్టి.. ఆ అప్‌డేట్స్ వస్తే.. ఇప్పుడు వినబడుతున్న వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే లేకపోలేదు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా వ్యవహరించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..

**********************************

*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్

*********************************

*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

*************************************

*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?

**************************************

*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

***************************************

Updated Date - 2023-09-20T21:52:33+05:30 IST