Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్

ABN , First Publish Date - 2023-09-20T18:43:01+05:30 IST

శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా.. ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి మంగ్లీ పాడిన ‘యాడున్నాడో’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్
Theppa Samudram Movie Song Recording Pic

శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా.. ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ (Kishori Dhatrak) హీరోయిన్‌గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’ (Theppa Samudram). సతీష్ రాపోలు (Sateesh Rapolu) దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించారు. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్ ‘యాడున్నాడో’ను ఎమ్ఆర్‌టి (MRT) ఆడియో ద్వారా మేకర్స్ విడుదల చేశారు.

‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘సిరిమల్లె పువ్వా’ తరహాలో.. కాబోయే వాడు కోసం ఓ యువతి పాడుకునే పాటలా.. ఈ సాంగ్‌ని మంచి మాస్ బీట్‌తో కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ బాగా నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్ ‘యాడున్నాడో’కు మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని తెలిపారు. (Yaadunnado Lyrical Song)


Teppa-Samudram.jpg

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ.. “గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేశాను. తెప్ప సముద్రం కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. షూటింగ్ అంతా పూర్తయింది. వినాయక చవితి సందర్భంగా సింగర్ మంగ్లీ పాడిన ‘యాడున్నాడో’ పాటను విడుదల చేయగా.. శ్రోతల్ని ఈ పాట బాగా అలరిస్తోంది. పి.ఆర్ అద్భుతమైన పాటలు అందించారు. సినిమాని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

*************************************

*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?

**************************************

*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

***************************************

*Shruti Haasan: శృతి హాసన్‌కి చెమటలు పట్టించిన అజ్ఞాత వ్యక్తి..

****************************************

Updated Date - 2023-09-20T18:43:01+05:30 IST