Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

ABN , First Publish Date - 2023-09-20T15:31:05+05:30 IST

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..
Raghava Lawrence in Chandramukhi 2

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ (Lyca Productions) బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు (P Vasu) తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న విడుదలయ్యేందుకు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ (Sri Lakshmi Movies) బ్యాన‌ర్‌ వారు విడుదల చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. 17 సంవత్స‌రాల క్రితం చంద్ర‌ముఖి తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి చంద్రముఖి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టంగా తెలియజేశారు. చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో అలరించబోతున్నారు. (Chandramukhi 2 Ready to Release)


Raghava-Lawrence.jpg

వాస్తవానికి సెప్టెంబర్ 15నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సినిమాని సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 24న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్స్ యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Shruti Haasan: శృతి హాసన్‌కి చెమటలు పట్టించిన అజ్ఞాత వ్యక్తి..

****************************************

*RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో‌ వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్

****************************************

*Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?

***************************************

Updated Date - 2023-09-20T15:31:05+05:30 IST