Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

ABN , First Publish Date - 2023-09-20T17:49:26+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ డ్యాన్సింగ్ బ్యూటీ సాయి పల్లవి ఓ సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ సాయి పల్లవి కూడా ట్విట్టర్ వేదికగా.. ఈ సినిమా వివరాలను తెలియజేస్తూ.. తెలుగులో తెలుగు ప్రేక్షకులకు ముందుకు మళ్లీ వస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది
Sai Pallavi

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ డ్యాన్సింగ్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ఓ సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ సాయి పల్లవి కూడా ట్విట్టర్ వేదికగా.. ఈ సినిమా వివరాలను తెలియజేస్తూ.. తెలుగులో తెలుగు ప్రేక్షకులకు ముందుకు మళ్లీ వస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. విషయంలోకి వస్తే..

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) పాన్ ఇండియా చిత్రం #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన టీమ్, త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. బన్నీ వాసు (Bunny Vas) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్‌లను అందించిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NC23 పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కాబోతోంది. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించబోతున్నారని, కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Sai-Pallavi.jpg

ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా, మంగళవారం సినిమాలో హీరోయిన్ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు (బుధవారం) మేకర్స్ ఆమె ఎవరో వెల్లడించారు. వెరీ బ్యూటీఫుల్, ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు. నాగచైతన్య, సాయి పల్లవి.. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ స్టోరి’ (Love Story)లో కలిసి పనిచేశారు. ఇప్పుడు చేయబోయే సినిమాలోనూ వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

Sai-Pallavi-2.jpg


ఇవి కూడా చదవండి:

============================

*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?

**************************************

*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

***************************************

*Shruti Haasan: శృతి హాసన్‌కి చెమటలు పట్టించిన అజ్ఞాత వ్యక్తి..

****************************************

Updated Date - 2023-09-20T17:49:26+05:30 IST