Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..

ABN , First Publish Date - 2023-09-20T20:32:03+05:30 IST

యాక్షన్ హీరో విశాల్, ఎస్ జే సూర్య, రీతూ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మార్క్ ఆంథోని’. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.

Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..
Mark Antony Success Meet

యాక్షన్ హీరో విశాల్ (Vishal), ఎస్ జే సూర్య (SJ Suryah), రీతూ వర్మ (Ritu Varma) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మార్క్ ఆంథోని’ (Mark Antony). సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. మంచి వసూళ్లతో మూవీ ప్రదర్శింపబడుతుండటంతో తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో విశాల్ (Vishal) మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంథోని’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. రివ్యూలు బాగుండి, కలెక్షన్లు కూడా బాగా వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో మార్క్ ఆంథోని ఉండటం ఆనందంగా ఉంది. కరోనా తర్వాత ఆడియెన్స్ ఏ సినిమాకు వెళ్లాలన్నా చాలా ఆలోచిస్తున్నారు. థియేటర్లకు జనాలను రప్పించడమే పెద్ద సవాలుగా మారింది. రెండున్నర గంటల సినిమాను రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో చూపించి, ఆకట్టుకుని రప్పించాలి. అలా మా ట్రైలర్ అందరికీ నచ్చింది. ఇప్పుడు సినిమాను చూస్తున్నారు. వారు పెట్టిన టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. (Mark Antony Success Meet)


SJ-Surya.jpg

ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సినిమాలోని ప్రతీ సీన్‌కు అందరూ పగలబడి నవ్వుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. సునీల్ గారి కామెడీ ఓ మెడిసిన్ లాంటిది. అధిక్ నాకు ఈ కథ నెరేట్ చేసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. అధిక్‌తో సినిమా చేస్తున్నానని తెలియడంతో ఇండస్ట్రీలో కొంత మంది వద్దని వారించారు. కానీ అధిక్ నెరేషన్ నాకు నచ్చింది. సినిమా బాగా తీస్తాడని నాకు నమ్మకం ఉండేది.. చెప్పింది చెప్పినట్టుగా తీశాడు. ఈ సినిమాను జనాలు థియేటర్లోనే చూస్తున్నారు. నాకు సంతోషంగా అనిపిస్తోంది. తెగిన ప్రతీ టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు ఇస్తాను. మా సినిమాను ఇంకా చూడని వాళ్లుంటే థియేటర్లో తప్పకుండా చూడాలని కోరారు.

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా విశాల్ అన్నతో నా ప్రయాణం. మార్క్ ఆంథోని అనేది నాకు రచయితగా, దర్శకుడిగా పునర్జన్మను ఇచ్చింది. విశాల్ లాంటి హీరో నన్ను నమ్మడం అనేది ఆశామాషీ విషయం కాదు. నన్ను నమ్మిన విశాల్ అన్నకి థాంక్స్. అడిగిందల్లా ఇచ్చిన నిర్మాత వినోద్ గారికి థాంక్స్. ఎస్ జే సూర్య, సునీల్ పాత్రలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే సంతోషంగా ఉంది. మా చిత్రం ఆడియెన్స్‌కు నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్

*********************************

*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

*************************************

*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?

**************************************

*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

***************************************

Updated Date - 2023-09-20T20:32:07+05:30 IST