Salaar: అభిమానులకు 100 టికెట్స్ ఇస్తానంటోన్న యంగ్ హీరో.. క్రేజ్ అలా ఉంది మరి!

ABN , First Publish Date - 2023-12-16T22:18:08+05:30 IST

‘సలార్’ సునామీ‌కి సమయం దగ్గరపడుతోంది. అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘సలార్’ ట్యాగ్ వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడంతా ఇక టికెట్ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘సలార్’ ఎర్లీ మార్నింగ్ షో‌కి సంబంధించి 100 టికెట్లను ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి ఇవ్వబోతున్నట్లుగా నిఖిల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Salaar: అభిమానులకు 100 టికెట్స్ ఇస్తానంటోన్న యంగ్ హీరో.. క్రేజ్ అలా ఉంది మరి!
Prabhas in Salaar

‘సలార్’ సునామీ‌కి సమయం దగ్గరపడుతోంది. అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘సలార్’ ట్యాగ్ వైరల్ అవుతూనే ఉంది. ట్రెండ్‌ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పుడంతా ఇక టికెట్ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘సలార్’ ఫస్ట్ డే ఫస్ట్ షో‌ని చూసేందుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ఫ్యాన్స్ అందరూ సిద్ధమవుతున్నారు. విశేషం ఏమిటంటే.. ‘సలార్’ చూసేందుకు హీరోలు సైతం రెడీ అవుతుండటం.

తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో ఏకంగా 100 టికెట్స్ అదీ కూడా.. విడుదల రోజు తెల్లవారు జామున ఒంటిగంట షో‌కి టికెట్స్ ఇస్తున్నానంటూ తెలియజేసి వార్తల్లో నిలిచారు. ఆ హీరో మరెవరో కాదు.. నిఖిల్. ‘‘పబ్లిక్ డిమాండ్ మేరకు హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘సలార్’ తెల్లవారు జామున ఒంటిగంట షోకు సంబంధించి నాతో కలిపి డార్లింగ్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి 100 టికెట్స్ ఇవ్వబోతున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇదే థియేటర్‌లో అదే టైమ్‌కి ‘మిర్చి’ స్పెషల్ షో చూశాను. మరోసారి చరిత్ర సృష్టిద్దాం’’ అని నిఖిల్ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది.


Nikhil.jpg

నిఖిల్ చేసిన ఈ ట్వీట్‌కు బీభత్సమైన స్పందన వస్తోంది. మాకు కావాలంటే మాకు కావాలి అంటూ ఫ్యాన్స్, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిఖిల్‌తో కలిసి ‘సలార్’ని చూసే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరో వైపు నైజాంలో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా.. తొలి టికెట్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూ. 10,116/- లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చాలా మంది ‘సలార్’ కోసం క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్

******************************************

*Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి

*************************************

*SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌

*****************************************

*Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?

************************************

Updated Date - 2023-12-16T22:18:09+05:30 IST