Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2023-12-16T17:23:38+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సలార్- సీజ్ ఫైర్’ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కెజియఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమస్టిక్, ఓవర్సీస్ ప్రాంతాలలో గ్రౌండ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా వుంది. ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా‌గా భావిస్తోన్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశారు.

Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?
Salaar First Ticket bagged by SS Rajamouli

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సలార్- సీజ్ ఫైర్’ (Salaar- Ceasefire) విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కెజియఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమస్టిక్, ఓవర్సీస్ ప్రాంతాలలో గ్రౌండ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా వుంది. ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా‌గా భావిస్తోన్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఈ చిత్ర ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేయడంతో.. సినిమాపై మరింతగా అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి’ని అందించి, ఆయనని పాన్ ఇండియా స్టార్‌ని చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నైజాం ఏరియాకు సంబంధించి ‘సలార్’ ఫస్ట్ టిక్కెట్‌ (Salaar First Ticket)ను కొనుగోలు చేశారు. నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి నైజాంలో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ సలార్ ఫస్ట్ టిక్కెట్‌ను.. టీమ్, నిర్మాత నవీన్ యెర్నేని నుండి కొనుగోలు చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల. బుకింగ్‌లు భారీ వేడుకలతో అతి త్వరలో గ్రాండ్‌గా ఓపెన్ అవుతాయి’’ అని తెలియజేశారు.


Rajamouli.jpg

మేకర్స్ షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి‌తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, మైత్రీ నవీన్ యెర్నేని, హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్‌ వున్నారు. హైదరాబాద్ RTC X రోడ్స్‌లోని సంధ్య 70 MMలో 7 AM షో కోసం రాజమౌళి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నైజాం అంతటా రికార్డ్ స్థాయి సెంటర్లలో ‘సలార్’ను రిలీజ్ చేయబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి:

====================

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

***********************************

Updated Date - 2023-12-16T17:29:17+05:30 IST