Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్

ABN , First Publish Date - 2023-12-16T20:34:45+05:30 IST

తన అత్తగారైన భూమా శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్‌ని పంచుకున్నారు. తను తండ్రి కాబోతున్నట్లుగా తెలుపుతూ.. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. శనివారం భూమా శోభా నాగిరెడ్డి జయంతి. ఆమెను స్మరించుకుంటూ మనోజ్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్
Manchu Manoj and Mounika

తన అత్తగారైన భూమా శోభా నాగిరెడ్డి (Bhuma Shoba Nagi Reddy) బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని మంచు మనోజ్ (Manchu Manoj) సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్‌ (Good News)ని పంచుకున్నారు. తను తండ్రి కాబోతున్నట్లుగా తెలుపుతూ.. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. శనివారం భూమా శోభా నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నామని చెప్పిన మనోజ్.. మరోసారి తన అత్తమామలు అమ్మమ్మ, తాతయ్యలు కాబోతున్నారనే సంచలన విషయాన్ని ప్రకటించారు.

Mounikc.jpg

మనోజ్ తన ట్వీట్‌లో.. ‘‘మా అత్తమ్మ శ్రీ భూమా శోభా నాగి రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ గౌరవించుకుంటున్నాము. అత్తమ్మా.. మీ జయంతిని పురస్కరించుకుని ఓ సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నాను. మీరూ, శ్రీ భూమా నాగిరెడ్డి మామ మరోసారి అమ్మమ్మ తాతయ్యలు అవుతున్నారు. మా చిన్న ధైరవ్ అన్న‌గా ప్రమోషన్ పొందుతున్నందుకు థ్రిల్ అవుతున్నాడు. పెద్దదవుతున్న మా కుటుంబాన్ని అంతులేని ప్రేమతో మీరు చూస్తూనే ఉంటారనీ, రక్షిస్తారని భావిస్తూ.. మీకు కృతజ్ఞులమై ఉంటాము. మా అమ్మ నిర్మలగారు, మా నాన్న మోహన్ బాబుగారి ఆశీస్సులతో పాటు.. మా ఫ్యామిలీలోని సభ్యులందరి ప్రేమ, మద్దతు మాకు ఉంటుందని భావిస్తున్నాము..’’ అని పేర్కొన్నారు.


Manchu.jpg

మంచు మనోజ్ షేర్ చేసిన ఈ వార్తతో ఆయన అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ‘గుడ్ న్యూస్ చెప్పావ్ అన్నా.. మీ ఇద్దరికి శుభాకాంక్షలు’, ‘ఇది మీ జీవితంలో చాలా ఉత్తమమైన దశ’, ‘వావ్.. గుడ్ న్యూస్ చెప్పావ్ అన్నా’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది భూమా మౌనికను (Bhuma Mounika) పెళ్లాడి, వ్యక్తిగత జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించారు మంచు మనోజ్. వ్యత్తిరీత్యా కూడా న్యూ జర్నీ మొదలుపెట్టారు. వెండితెరపై హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. ‘ఉస్తాద్‌ ర్యాంప్‌ ఆడిద్దాం’ (Ustaad Ramp aadidham)అనే గేమ్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు మనోజ్.


ఇవి కూడా చదవండి:

====================

*Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి

*************************************

*SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌

*****************************************

*Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?

************************************

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

Updated Date - 2023-12-16T20:42:26+05:30 IST