Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి

ABN , First Publish Date - 2023-12-16T19:53:19+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి
Bhagyashri Borse

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పటి వరకు వినిపించిన హీరోయిన్ల విషయంలో హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా ఊహించుకున్న వారందరికీ హరీష్ షాక్ ఇస్తూ.. న్యూ బ్యూటీని మాస్ మహారాజా కోసం సెట్ చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటిస్తోంది.

తాజాగా ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ.. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోందని మేకర్స్ తెలియజేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్‌గా వుంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది. నిజంగా మేకర్స్ చెప్పినట్లుగా క్లాస్ రాణీలానే ఉంది. హరీష్ శంకర్ హీరోయిన్స్‌ని అద్భుతంగా చూపిస్తారు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించడం కాయం అంటూ అప్పుడే భాగ్యశ్రీ బోర్సే‌ని చూసిన వారంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం. (Bhagyashri Borse Heroine)


Ravi-Teja-Heroine.jpg

రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్‌లోనూ చాలా క్రేజ్ వుంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారని, అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని, పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌

*****************************************

*Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?

************************************

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

Updated Date - 2023-12-16T19:53:20+05:30 IST