SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌

ABN , First Publish Date - 2023-12-16T19:34:15+05:30 IST

‘మేజర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన అడివి శేష్, తన అప్ కమింగ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా #SeshExShruti కోసం హీరోయిన్ శృతి హాసన్‌తో జతకట్టబోతున్నారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి శృతిహాసన్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.

SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌
Shruti Haasan In SeshExShruti

‘మేజర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన అడివి శేష్, తన అప్ కమింగ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా #SeshExShruti కోసం హీరోయిన్ శృతి హాసన్‌తో జతకట్టబోతున్నారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతోన్న ఒక్కో పోస్టర్‌.. సినిమాపై క్యురియాసిటీని పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి శృతి హాసన్ (Shruti Haasan) ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ సినిమా డైనమిక్ ప్రపంచంలోకి స్నీక్ పీక్‌ను అందిస్తోంది. శృతి హాసన్ స్వయంగా పరిచయం చేసిన అడివి శేష్ క్యారెక్టర్ పోస్టర్ తర్వాత ఈ కొత్త పోస్టర్ మూవీ రెండవ విజువల్ ఎస్సెట్. ఈ తాజా పోస్టర్‌లో, శృతి హసన్ తన కళ్ళలో కోపం, ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 18న అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. తాజాగా అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శృతి హాసన్ పోస్టర్‌ని పంచుకున్నారు.


Shruti-Haasan-Pic.jpg

“ఆమె కళ్లలో కోపాన్ని చూడండి! టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న విడుదల. SeshEXShruti. శృతిహాసన్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బ్యూటీఫుల్ హార్ట్. బ్యూటీఫుల్ సోల్. అద్భుతమైన కెమిస్ట్రీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని రాశారు. అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ చిత్రం ‘మేజర్’ (Major).. బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అడివి శేష్‌కు రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుంది. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్‌కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ కు ఆయన దర్శకత్వం వహించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్‌ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?

************************************

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

***********************************

Updated Date - 2023-12-16T19:34:16+05:30 IST