Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2023-07-15T22:26:40+05:30 IST

జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తొలి పోస్ట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ ఫొటో కూడా ఉండటంతో.. ఈ పోస్ట్ చూసిన ఆమె సంబరపడుతోంది. ఈ అవకాశం కల్పించిన యూనిట్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్
Nidhhi Agerwal

జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ (Pawan kalyan) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తొలి పోస్ట్‌ (Instagram First post) ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నెల నాలుగో తేదీన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన పవర్ స్టార్.. ఎలాంటి పోస్ట్‌ చేయకుండానే 2 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సినిమా ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న, తనని అభిమానించే అలాగే తను అభిమానించే వారందరితో ఉన్న ఫొటోలన్నింటిని కలిపి ఓ వీడియోగా చేసి.. ఇన్‌స్టా‌లో తొలి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా.. పవర్‌స్టార్‌కి ఇంత ఓపిక, సహనం ఎక్కడిది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్‌లో మా హీరో ఫొటో ఉందా? అని ప్రతి ఒక్క హీరో అభిమాని కళ్లు పెద్దవి చేసి మరీ ఒకటికి రెండు సార్లు ఈ వీడియోను చూస్తున్నారంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


ఇంకా ఆయన పెట్టిన పోస్ట్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్లు కొందరైతే ఆయనకి థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. తాజాగా బ్యూటీ డాల్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ఆ లిస్ట్‌లో తన ఫొటోని చూసుకుని ఎంతో మురిసిపోయింది. పవన్ కళ్యాణ్ తనకిచ్చిన గౌరవానికి ఎంతో సంబరపడుతూ.. ఆయనకు, ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం కల్పించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Nidhhi-Pic.jpg

‘‘తెలుగు సినీ పరిశ్రమలో భాగమై...  ప్రతిభావంతులు, నిరాడంబరులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారితో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శకులు క్రిష్ గారికీ, నిర్మాత AM రత్నంగారికీ మరియు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని నిధి అగర్వాల్ పోస్ట్ చేసింది. నిధి అగర్వాల్ పోస్ట్ చూసిన మెగా అభిమానులు మా అన్న ఎవరినీ మరిచిపోడు.. అందరూ గుర్తుంటారు.. కాకపోతే సమయం రావాలంతే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

Updated Date - 2023-07-15T22:26:40+05:30 IST