SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

ABN , First Publish Date - 2023-07-15T17:07:43+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది మాములు ట్రీట్ కాదు. వారికే కాదు.. సినిమా లవర్స్‌కి కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతోన్న చిత్రంతో సితార ఘట్టమనేని, ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!
Mahesh with Sitara and NTR with Abhay Ram

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఫ్యాన్స్‌కి ఇది మాములు ట్రీట్ కాదు. వారికే కాదు.. సినిమా లవర్స్‌కి కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పెద్ద కుమారుడు అభయ్ రామ్ (Abhay Ram) కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఈ వార్త ఇరు హీరోల ఫ్యాన్స్‌కి సూపర్ కిక్ ఇచ్చేదనే చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు, సూపర్ కృష్ణ జనరేషన్‌ని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు, ఎన్టీఆర్ నెక్ట్స్ జనరేషన్ హీరోలుగా చలామణీ అవుతున్నారు. వారి తర్వాత జనరేషన్ అంటే సితార, అభయ్ కూడా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తుండటం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి.


మహేష్, ఎన్టీఆర్‌ (Mahesh and NTR)ల స్నేహం ఇప్పటిది కాదు. మహేష్‌ని ఎన్టీఆర్.. ‘మహేష్ అన్న’ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ అందించుకుంటూ.. ఇండస్ట్రీలోని హీరోల మధ్య మంచి వాతావరణం ఉందనేలా హింట్స్ ఇస్తుంటారు. ఇప్పుడీ వాతావరణాన్ని వారి సంతానం కూడా ముందుకు తీసుకువెళుతుండటం.. ఆహ్వానించదగ్గ పరిణామం. సరే వారి ఎంట్రీకి సంబంధించిన వార్తే ఇలా ఉంటే.. వారు ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలిస్తే.. ఇది కదా.. అసలు ట్రీట్ అని అంతా అనుకోకుండా ఉండలేరు.

NTR-and-Mahesh.jpg

ఇంతకీ సితార, అభిరామ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఎవరి దర్శకత్వంలో అంటే.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) చేయబోయే తదుపరి చిత్రంలో. అవును.. ఇప్పటికే ఈ విషయంపై ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు కానీ.. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న SSMB29 చిత్రంలో ఇంట్రడక్షన్ సీన్స్ కోసం సితార, అభయ్‌లను నటింపజేయాలని యూనిట్ భావిస్తోందట. దీని సంబంధించి చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. సితార ఇప్పటికే మహేష్ బాబు సినిమాలోని పాట కోసం డ్యాన్స్ చేసింది. అభయ్‌ మాత్రం ఇంత వరకు కెమెరా ముందుకు రాలేదు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్తతో నందమూరి, ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి. ఇక కాంబోకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


ఇవి కూడా చదవండి:

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

Updated Date - 2023-07-15T17:07:43+05:30 IST