Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

ABN , First Publish Date - 2023-07-14T20:45:15+05:30 IST

బాలయ్య ‘వీరసింహారెడ్డి’ హీరోయిన్ హనీరోజ్‌ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పడు పాన్ ఇండియా మూవీ ‘రాచెల్’లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో హనీరోజ్ భయపెడుతూనే.. కుర్రకారుకి కావాల్సినవి ఎక్స్‌పోజ్ చేస్తోంది.

Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!
Honey Rose

సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రంలో బాలయ్య సరసన పెద్ద తరహా పాత్రలో నటించిన హనీరోజ్ (Honey Rose).. ఆ పాత్రతో ఎక్కడా లేని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ పాత్రతో అనే కంటే.. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టే పిక్స్‌తో కుర్రకారుకి మతిపోగొడుతోంది అంటే బాగుంటుంది. ఎలా కనబడితే క్రేజ్ సంపాదించవచ్చనేది.. హనీరోజ్‌కి తెలిసినంతగా.. ఇప్పుడున్న హీరోయిన్లకు కూడా తెలియదంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అలా రెచ్చగొడుతుంటుంది సోషల్ మాధ్యమాలలో ఈ మలయాళ బ్యూటీ. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్​డమ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు సినిమాల కంటే కూడా షాప్ ఓపెనింగ్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది.


ఆ షాప్ ఓపెనింగ్స్‌లో టైట్ ఫిట్ డ్రస్సులతో దర్శనమిచ్చి.. మందు కొట్టకుండానే కుర్రకారుకి మత్తెక్కించేస్తుంటుంది. మాములుగా హనీరోజ్‌ని అలా చూసే తట్టుకోలేకపోతుంటే.. ఇప్పుడామె చేస్తున్న ఓ చిత్రంలో మరింతగా పిచ్చెక్కించడానికి ఆమె సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో హనీరోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రాచెల్’ (Rachel). ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో ఆనందిని బాల (Anandhini Bala) దర్శకురాలిగా పరిచయం అవుతుండగా.. అబ్రిడ్ షైన్ సమర్పిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ కాస్త భయంకరంగా ఉన్నప్పటికీ.. అందులోనూ హనీరోజ్ పరువాల పదునుతో గుండెల్ని మెలిపెట్టేస్తోంది.

ఈ ఫస్ట్ లుక్‌లో (Rachel First Look Out) ఆమె కత్తి పట్టుకుని మాంసం కొడుతోంది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. సీరియస్ లుక్‌లో హనీరోజ్ ఆకర్షిస్తున్నా.. ఆమె వేషధారణ మాత్రం.. ఆమెలోని గ్లామరస్ యాంగిల్‌ని తెలియజేస్తోంది. ఈ లుక్‌ని బట్టి ఆమె బీఫ్ అమ్మే దుకాణదారుని పాత్ర చేస్తుందని అనుకోవచ్చు. కానీ ఆమె లుక్ చూస్తుంటే.. విలన్ తరహా పాత్ర కూడా అయ్యిండొచ్చనిపిస్తుంది. ఏదైతేనేం.. హనీరోజ్‌ని ఎలా చూడాలని అనుకుంటారో.. అలా చూపిస్తూనే.. సినిమాలోని పాత్రకు కనెక్ట్ చేసిన విధానం.. ఈ సినిమాపై అంచనాలను పెంచేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Honey Rose Look in Rachel)


ఇవి కూడా చదవండి:

**************************************

*Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు

**************************************

*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

Updated Date - 2023-07-14T20:45:15+05:30 IST