Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

ABN , First Publish Date - 2023-07-15T15:26:21+05:30 IST

సితార ఇప్పుడు ఓ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కంపెనీ సితారపై ‘ప్రిన్సెస్’ పేరుతో ఓ పార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కార్యక్రమానికి నమ్రతతో పాటు సితార కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నమ్రత మాట్లాడుతూ.. గౌతమ్ కృష్ణ ఎంట్రీకి ఇంకా చాలా టైముందని, సితార మాత్రం నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందని తెలిపారు.

Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది
Sitara Ghattamaneni and Namrata Shirodkar

సూపర్​ స్టార్​ మహేష్​ బాబు (Super Star Mahesh Babu) గారాల పట్టి సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) రోజురోజుకీ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా ఆమె సోషల్​ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటోంది. తన చిన్నతనంలోనే సినిమా సెలెబ్రిటీస్​ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన సితార.. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను చూస్తే.. ఎవ్వరైనా ఆమెకి ఫ్యాన్ కావాల్సిందే. అంత చక్కగా, క్యూట్‌గా ఉంటున్నాయి ఆమె ఫొటోలు, వీడియోలు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉండే.. సితార ఇప్పుడు ఓ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిందంటే.. తండ్రి మహేష్‌ని ఆమె ఏ విధంగా ఫాలో అవుతుందో అర్థం చేసుకోవచ్చు.


ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్‌ని రీసెంట్‌గానే షూట్ చేశారు. ఆ యాడ్‌కి సంబంధించిన ఫొటోలను కూడా కంపెనీ వారు విడుదల చేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఆ యాడ్ చిత్రాలను న్యూయార్క్ టైం స్క్వేర్​ వేదికపై ప్రమోట్​ చేయడం. నిజంగా ఇది అరుదైన రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడా జ్యూవెలరీ కంపెనీ.. సితారపై ఓ షార్ట్ ఫిల్మ్‌ని కూడా విడుదల చేసింది. ‘ప్రిన్సెస్’ ( పేరుతో రూపుదిద్దుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్‌‌ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నమ్రతతో కలిసి సితార కూడా హాజరైంది.

Namrata.jpg

ఈ కార్యక్రమంలో నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) మాట్లాడుతూ.. సితారను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సితారకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆమె కోరికను కాదని చెప్పలేం. గౌతమ్‌ (Gautham Krishna) ఎంట్రీకి ఇంకా చాలా టైముందని తెలుపగా.. నా మొదటి రెమ్యునరేషన్‌ని చారిటీకి ఇచ్చానని తెలిపింది సితార ఘట్టమనేని. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి నాకంటే ఎక్కువగా నాన్న సంతోషించారు. న్యూయార్క్ టైం స్క్వేర్ మీద డిస్‌ప్లే విషయం నాకు తెలియదు. అది నాన్న నాకు ఇచ్చిన సర్‌ప్రైజ్.. అని సితార చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

*Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు

**************************************

Updated Date - 2023-07-15T15:26:21+05:30 IST