Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

ABN , First Publish Date - 2023-07-14T22:12:10+05:30 IST

రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య కోరారు. కానీ నాకు అవగాహన లేదు.. నేను సినీ రంగంలోనే ఉంటానని చెప్పినట్లుగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత అంతగా బయటికి రాని సాయితేజ్.. ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీలోని దేవాలయాల్లో పూజలు జరిపించుకుంటున్నారు.

Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు
Sai Dharam Tej at Kadapa Dargah

రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య కోరారు. కానీ నాకు అవగాహన లేదు.. నేను సినీ రంగంలోనే ఉంటానని చెప్పినట్లుగా సుప్రీం హీరో సాయిధరమ్ (Superem Hero Sai Dharam Tej) తేజ్ చెప్పుకొచ్చారు. మామయ్య పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). జూలై 28న విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉండగా.. ‘బ్రో’ చిత్ర ప్రమోషన్స్ సాయిధరమ్ తేజ్ చూసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత అంతగా బయటికి రాని సాయితేజ్.. ఇప్పుడు ప్రత్యేకంగా దేవాలయాల్లో పూజలు జరిపించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కాణిపాకం (Kanipakam), శ్రీకాళహస్తి (Sri Kalahasthi) దేవాలయాలను సందర్శించారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప దర్గా (Kadapa Dargah)ను కూడా ఆయన దర్శించారు.


Sai-Tej-1.jpg

సాయిధరమ్ తేజ్ వెళ్లిన ప్రతి చోటా ఆయనకు ఘన స్వాగతం లభించింది. శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ..

Sai-tej-2.jpg

‘‘ఇది నాకు పునర్జన్మ.. దేవుడు పునర్జన్మ ప్రసాదించారు.. అందుకే ఆలయాలను సందర్శిస్తున్నా. కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇలా దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ‘బ్రో’ సినిమా విషయానికి వస్తే.. మామయ్యతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మామయ్య రాజకీయాలతో (Politics) బిజీగా ఉన్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే నన్ను కూడా రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు. కానీ నేను సినీ రంగంలోనే ఉంటానని చెప్పాను. పవన్ మామయ్య అంటే నాకు ప్రాణం’’ అని తెలిపారు.

Sai-Tej-3.jpg


ఇవి కూడా చదవండి:

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

*Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు

**************************************

*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

Updated Date - 2023-07-14T22:12:10+05:30 IST