Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

ABN , First Publish Date - 2023-07-15T12:38:01+05:30 IST

అనసూయ ఈ మధ్య కాంట్రవర్సీల జోలికి పోనని, ముఖ్యంగా విజయ్ దేవరకొండ విషయంలో అసలు రియాక్ట్ కానని ఓ మీడియా సమావేశంలో వెల్లడించింది. మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నానని, అందుకే అవన్నీ పక్కన పెట్టేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరీ ఏమైందో ఏమో గానీ.. మళ్లీ అనసూయ ట్విట్టర్ వేదికగా ‘నా ప్రమేయం లేకుండా ఏదీ’ అంటూ చేసిన ట్వీట్.. కాంట్రవర్సీ అవుతోంది.

Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!
Anasuya Bharadwaj

అనసూయ ఈ మధ్య కాంట్రవర్సీల జోలికి పోనని, ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో అసలు రియాక్ట్ కానని ఓ మీడియా సమావేశంలో వెల్లడించింది. మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నానని, అందుకే అవన్నీ పక్కన పెట్టేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరీ ఏమైందో ఏమో గానీ.. మళ్లీ అనసూయ (Anasuya) ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్.. ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా.. తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘బేబీ’ సినిమాని ఉద్దేశించే అనసూయ ఈ మాటలు అని ఉంటుందని అంతా అనుకుంటుండటం విశేషం.


Anasuya-2.jpg

‘‘వావ్.. నేను అందరికీ ఎంత ముఖ్యమో ఇప్పుడర్థమవుతుంది. నా ప్రమేయం లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంటే.. అందరి గురించి చాలా తెలుసుకోవాలి. నాపై అంత డిపెండ్ అయి ఉన్నారు మరి. నా పేరు లేకుండా ఏదీ చెప్పలేకపోతున్నారు..’’ అంటూ అనసూయ తాజాగా ఓ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందనేది క్లారిటీ లేదు కానీ.. ‘బేబీ’ ప్రమోషన్స్‌ (Baby Movie Promotions)లో అనసూయ పేరు కూడా వినబడింది కాబట్టి.. కచ్చితంగా ఇది ‘బేబీ’ (Baby) సినిమా యూనిట్‌ని ఉద్దేశించే అని అంతా అనుకుంటున్నారు.


ఇక అనసూయ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లకి కూడా అర్థం కాలేదు. అందుకే మళ్లీ ఏమైంది మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనునీ ఏమైనా అంటే శవాలు లేస్తాయి అంటూ ఆమె ఫ్యాన్స్ కొందరు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. మరికొందరు ఎప్పుడూ ట్రోలర్స్ గురించేనా? కాస్త నిన్ను ఆరాధించే వారి గురించి కూడా పట్టించుకో.. అని అంటున్నారు. ‘బేబీ మూవీలో మీ పేరు బాగా వినబడుతుందండీ.. హీరోయిన్ కంటే కూడా అది మీకే సెట్ అవుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమాలో ఆంటీ అని పిలిచే సన్నివేశాలు.. అనసూయని దృష్టిలో పెట్టుకునే రాసినట్లుగా నెటిజన్ అభిప్రాయం. ఏదైతేనేం.. సోషల్ మీడియాకు కావాల్సిన మేతని అనసూయ మరోసారి ఇచ్చేసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

*Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు

**************************************

*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

Updated Date - 2023-07-15T12:38:01+05:30 IST