సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్.. దీనికంటే ‘హను-మాన్’నే బావుందంటూ..

ABN, First Publish Date - 2023-03-30T10:50:27+05:30

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అతి కొద్ది చిత్రాల్లో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.

Adipurush New poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అతి కొద్ది చిత్రాల్లో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. మొదటిసారి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించాడు. బాలీవుడ్ యువ దర్శకుడు డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ (Kriti Sanon), లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.

నిజానికి.. ఈ మూవీని మొదట సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అందులో భాగంగా.. సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్, అలాగే టీజర్‌ని విడుదల చేయగా.. యానిమేటేడ్ మూవీలా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అలాగే.. వానరులు, సైఫ్ లుక్‌పై సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అయితే తాలిబన్‌లా ఉన్నాడంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం ప్రస్తుతం ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. (Adipurush Release Date)

అయితే, మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ రిలీజ్ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున విడుదల మరోసారి వాయిదా పడుతుందంటూ రూమర్స్ వినిపించాయి. వాటిని కొట్టిపడేస్తూ.. ఓం రౌత్ ఇటీవలే ఓ ట్వీట్ చేశాడు. అందులో జూన్ 16‌కి ఫిక్సయిపోండని చెప్పాడు. దాంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అనంతరం.. శ్రీరామనవమి సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగానే ఓం రౌత్ మార్చి 30న ఓ పోస్టర్‌ని విడుదల చేశాడు. అందులో.. సీత, రాముడు, లక్ష్మణుడు నిలుచుని ఉండగా.. హనుమంతుడు మొక్కుతూ ఉంటాడు. దానికి ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్ సైతం రాసుకొచ్చాడు. అది ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగులోనూ రాయడం విశేషం. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. (Adipurush Update)

అయితే.. ఎప్పటిలాగే ఈ పోస్టర్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కి అంతగా నచ్చలేదు. దీంతో ‘రూ.500 కోట్లు పెట్టి యానిమేటేడ్ మూవీ తీస్తారా’.. ‘ఇంతకుముందుకి ఇప్పటికీ ఏ మాత్రం ఇంప్రూవ్‌‌మెంట్ లేదు’.. ‘ఈ పోస్టర్‌కి ఫిల్టర్ ఉపయోగించినట్లు ఉంది. అంతేకానీ ఆర్ట్ వేసినట్లు లేదు’.. ‘ఎందుకు రూ.500 కోట్లు వృథా చేస్తున్నావు ఓం రౌత్’.. ‘షరా మామూలే. ఏ మాత్రం మారలేదు’.. ‘దీనికంటే చిన్న సినిమా హనుమాన్ వీఎఫ్‌ఎక్స్ బావున్నాయి’ అంటూ విమర్శలు చేస్తున్నారు. (Adipurush Latest Update)

ఇవి కూడా చదవండి:

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Updated Date - 2023-03-30T11:10:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!